Begin typing your search above and press return to search.
ఫోటో స్టొరీ: భారత ప్రధానితో బాలీవుడ్ స్టార్లు
By: Tupaki Desk | 11 Jan 2019 4:11 AM GMTసహజంగా ఫిలిం ఇండస్ట్రీకి చెందిన ముఖ్యులు అధికారంలో ఉన్నవారిని కలిస్తే ఏదో వ్యక్తిగతమైన పనులను చక్కబెట్టుకోవడం కొసమో లేదా.. ఇండస్ట్రీకి సంబంధించిన సమస్యల పరిష్కారం గురించి వినతులు ఇవ్వడం కోసమో అయి ఉంటుంది. కానీ రొటీన్ కు భిన్నంగా బాలీవుడ్ ప్రముఖుల టీమ్ ప్రధాని నరేంద్ర మోదిని కలిసి భారతదేశ అభివృద్ధిలో ఫిలిం ఇండస్ట్రీ ఎలాంటి పాత్ర పోషించాలి.. తమ వైపు నుండి ఎలాంటి సహకారం అందించాలి అనే విషయాలపై గురువారం చర్చ జరిపిందట.
ఈ బాలీవుడ్ టీమ్ కు కరణ్ జోహార్ నేతృత్వం వహించాడట. ఈ టీమ్ లో రణబీర్ కపూర్.. రణవీర్ సింగ్.. సిద్ధార్థ్ మల్హోత్రా.. ఆయుష్మాన్ ఖురానా.. విక్కీ కౌశల్.. రాజ్ కుమార్ రావ్.. అలియా భట్.. ఏక్తా కపూర్.. భూమి పెడ్నేకర్.. రోహిత్ శెట్టి.. అశ్విని అయ్యర్ తివారిలు ఉన్నారు. చర్చలు జరిపిన అనంతరం ప్రధానమంత్రి తో ఒక సెల్ఫీ కూడా తీసుకున్నారు. మధ్యలో ప్రధాని తనదైన స్టైల్ లో చిరునవ్వులు చిందిస్తూ నిలబడ్డారు. బాలీవుడ్ టీమ్ అంతా అయన చుట్టూ నిలబడి ఖుషీఖుషీగా పోజిచ్చారు. సెల్ఫీ తీసింది ఎవరనుకున్నారు? రణవీర్ సింగ్.
ఈ ఫోటోను తన ఇన్ స్టాగ్రామ్ ఖాతా ద్వారా పోస్ట్ చేసిన కరణ్ జోహార్ "గౌరవనీయులైన ప్రధాని నరేంద్ర మోది గారిని కలవడం ఒక గొప్ప అవకాశం. భారతదేశానికి ఫిలిం ఇండస్ట్రీ తరపున ఏం చేయగలమో చర్చించాం. మన దేశానికి ఎంతో చేయాల్సి ఉంది. భారత దేశంలో ఒక పాజిటివ్ చేంజ్ తీసుకురావాలని మేమందరం కోరుకుకుంటున్నాం." అంతే కాకుండా సినిమా టికెట్లపై జీఎస్టీ తగ్గించినందుకు ఫిలిం ఇండస్ట్రీ తరఫున కేంద్రప్రభుత్వానికి ధన్యవాదాలు కూడా తెలిపాడు.