Begin typing your search above and press return to search.
బాలీవుడ్ సక్సెస్ ట్రెండ్ పట్టిన సౌత్ ఇండస్ర్టీ!
By: Tupaki Desk | 13 Aug 2022 6:40 AM GMTబాలీవుడ్ సీక్వెల్స్..ప్రాంచైజీ ట్రెండ్ ఇప్పుడు సౌత్ లో పరిపాటిగా మారుతోంది. అందులోనూ టాలీవుడ్..కోలీవుడ్ లో లో కొనసాగింపు..ప్రాంచైజీ కథల వ్యవహారం ట్రెండింగ్ గా మారుతోంది.'బాహుబలి'..'ఎఫ్-2'..'కేజీఎఫ్'..'విక్రమ్' వంటి చిత్రాల సక్సెస్ తో ప్రాంచైజీలకు డిమాండ్ పెరుగుతోంది. కొత్తగా రిస్క్ తీసుకోవడం కన్నా..సక్సెస్ అయిన చిత్రాలతోనే కథలు అల్లుకుంటే? మరో సక్సెస్ ఈజీ కదా? అన్న ఆలోచన దర్శకుల్లో కనిపిస్తుంది.
ఆ బ్రాండ్ తో సినిమాని సునాయాసంగా మార్కెట్ చేసుకోవచ్చు అన్న వ్యాపార దృక్ఫథం కనిపిస్తుంది. ఒకప్పుడు ఈ విధానం ఎక్కువగా హిందీ పరిశ్రమలో ఉండేది. సీక్వెల్స్..కొనసాగింపు కథలు..ప్రాంచైజీలకు అక్కడ సక్సెస్ రేట్ బాగుంటుంది. అయితే ఇప్పుడా ట్రెండ్ సౌత్ పరిశ్రమపైనా తీవ్ర ప్రభావం చూపిస్తుంది.'బాహుబలి'..'పుష్ప' లాంటి సినిమాలు ముందుగా ఒక సినిమాగా అనుకున్నవే.
కానీ అదే కథని రెండు భాగాలుగా చెప్పాలని మధ్యలో పుట్టిన ఆలోచన నుంచి అవి కొనసాగింపు కథలుగా అవరించాయి. ఇప్పడు'పుష్ప-2' కొనసాగిపు కథ రెడీ అవుతోన్న సంగతి తెలిసిందే. అలాగే'కేజీఎఫ్' ని ముందే రెండు భాగాలుగా చెప్పాలనుకున్నారు. అదే ప్రాసస్ లో రెండు భాగాలుగా చేసి సక్సెస్ అందుకున్నారు.
ఇక్కడితో దీన్ని ముగించేస్తారు? అని చాలా మంది భావించారు. కానీ కేజీఎఫ్ లో చెప్పాల్సింది ఇంకా ఉందని చివర్లో హింట్ ఇచ్చారు. అందుకే చాప్టర్ -3కి రంగం సిద్దం చేస్తున్నారు. దీనికి ముగింపు ఎలా అన్నది దర్శకుడు మాత్రమే డిసైడ్ చేయాల్సి ఉంది. హిట్ కొనసాగినంత కాలం చాప్టర్లు వైజ్ గా ప్రేక్షకుల ముందుకు రావడం ఖాయం.
ఇక 'ఖైదీ'..'విక్రమ్' సినిమాలు ఇదే తరహాలో పెద్ద సక్సెస్ అయ్యాయి. దర్శకుడు లోకేష్ కనగరాజ్ సినిమాటిక్ యూనివర్శ్ తో'ఖైదీ-2'..'విక్రమ్-2' చిత్రాలు కూడా ఉంటాయని చెప్పేసారు. వీటి సక్సస్ తర్వాత కొనసాగింపు ఉంటుందా? ఉండదా? అన్నది డిసైడ్ అవుతుంది. ఇక'ఎఫ్ -2' ప్రాచైజీ నుంచి 'ఎఫ్ -3' కూడా రిలీజ్ అయి పెద్ద సక్సెస్ సాధించింది.
దీంతో అనీల్ రావిపూడి ఈ ప్రాంచైజీని మరింత కాలం కొనసాగించే ప్లాన్ లో ఉన్నాడు. దీనిలో భాగానే'ఎఫ్-4'ని ప్రకటించారు. ఇటీవల రిలీజ్ అయిన'బింబిసార' సక్సెస్ అయిన నేపథ్యంలో పార్ట్ -2 కూడా ప్రకటించారు. అలాగే మరో'సీతారామం' చేసినా ఆశ్చర్యపోనవసరం లేదని దర్శకుడు హను రాఘవపూడి అంటున్నారు. అంతకు ముందే'డీజేటిల్లు'...'గుఢచారి'..'హిట్' లాంటి చిత్రాలకు సీక్వెల్స్ ఉంటాయని ప్రకటించారు. అవిప్పుడు కార్యరూపం దాల్చే దశలో ఉన్నాయి.