Begin typing your search above and press return to search.

పాపం.. 5, 10 కోట్లనూ లెక్కలేసుకుంటున్న సూపర్‌ స్టార్‌

By:  Tupaki Desk   |   9 Sep 2022 1:30 AM GMT
పాపం.. 5, 10 కోట్లనూ లెక్కలేసుకుంటున్న సూపర్‌ స్టార్‌
X
ఒక సినిమా సూపర్ హిట్ అయితే కేవలం ఆ సినిమా సాధిస్తున్న వసూళ్లు గురించి మాత్రమే వార్తలు వస్తాయి. కానీ ఒక సినిమా ఫ్లాప్ అయితే ఎన్నో విషయాల గురించి వార్తలు వస్తాయి. ముఖ్యంగా స్టార్స్‌ సూపర్‌ స్టార్స్ సినిమాలు ఫ్లాప్ అయితే మీడియా వారు.. సోషల్‌ మీడియా జనాలు చీల్చి చండాడుతూ పోస్ట్‌ మార్టం నిర్వహిస్తూ ఒక్కో విషయాన్ని తెర పైకి తీసుకుని వస్తూ ఉంటారు.

ప్రమోషన్ సమయంలో అలా అన్నారు.. ఇలా అన్నారు చివరకు ఇలా ఉందేంటి సినిమా అంటూ కొందరు ప్రశ్నిస్తే మరి కొందరు మరో రకంగా ప్రమోషన్ సమయం లోని విషయాలను తీసుకు వచ్చి ట్రోల్స్ చేయడం మనం చూస్తూనే ఉంటాం. ఇప్పుడు బాలీవుడ్‌ సూపర్ స్టార్‌ ఆమీర్‌ ఖాన్‌ తన లాల్‌ సింగ్ చడ్డా సినిమా ఫ్లాప్ అవ్వడంతో అదే పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు.

లాల్‌ సింగ్ చడ్డా సినిమా ప్రమోషన్ సమయంలో సినిమాలను ఓటీటీ లో విడుదల అయిన కొన్ని వారాల్లోనే విడుదల చేయడం వల్ల థియేటర్లకు నష్టం జరుగుతుంది.. ప్రేక్షకులు థియేటర్లకు వచ్చేందుకు ఆసక్తి చూపడం లేదని.. అందుకే మా ఈ సినిమాను ఆరు నెలల వరకు ఓటీటీ లో స్ట్రీమింగ్‌ చేసేది లేదు అంటూ ప్రకటించాడు.

థియేట్రికల్‌ రిలీజ్ అయిన తర్వాత ఎంత ఆలస్యంగా సినిమాని ఓటీటీ ద్వారా స్ట్రీమింగ్‌ చేస్తే అంతగా రేటు తగ్గుతుంది. ఎంత త్వరగా స్ట్రీమింగ్‌ హక్కులను ఓటీటీలకు ఇస్తే వారు అంత ఎక్కువ మొత్తం ను ఇస్తారు. అందుకే సినిమా విడుదల అయిన మూడు నాలుగు వారాల్లోనే స్ట్రీమింగ్ కు ఇస్తే భారీగా లాభాలను నిర్మాతలు దక్కించుకుంటున్నారు.

లాల్ సింగ్ చడ్డా సినిమా దారుణమైన ఫలితాన్ని చవిచూసింది. ఇప్పుడు నిర్మాత తీవ్రమైన నష్టాల్లో ఉన్నాడు. ఆమీర్‌ ఖాన్‌ ఇప్పటికే తన పారితోషికంగా తీసుకున్న మొత్తంలో మెజార్టీ వాటాను నిర్మాణ సంస్థకి తిరిగి ఇచ్చేశాడని అంటున్నారు. ఇదే సమయంలో సినిమా ను ఓటీటీలో వెంటనే విడుదల చేసేందుకు కూడా నిర్మాణ సంస్థకి ఆమీర్ ఓకే చెప్పాడట.

ఆరు నెలల వరకు ఆగే కంటే ఇప్పుడు వెంటనే సినిమా ను ఓటీటీకి ఇస్తే అయిదు నుండి పది కోట్ల రూపాయలు అయినా అదనంగా వచ్చే అవకాశం ఉంటుంది. కనుక అది నిర్మాతలకు ఎంతో కొంత నష్టంను పూడ్చుతుంది అనేది ఆమీర్‌ అభిప్రాయం అయ్యి ఉండవచ్చు. అందుకే అలా లెక్కలు వేసుకుని మరీ పాపం ఆమీర్ ఖాన్ తన మాటలను పక్కన పెట్టి లాల్‌ సింగ్ చడ్డా త్వరలోనే స్ట్రీమింగ్ కి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడని బాలీవుడ్‌ లో ప్రచారం జరుగుతోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.