Begin typing your search above and press return to search.

బాయ్ కాట్ ట్రెండ్ ను తెగ తిట్టేసిన బాలీవుడ్ కుర్ర హీరో

By:  Tupaki Desk   |   18 Aug 2022 6:30 AM GMT
బాయ్ కాట్ ట్రెండ్ ను తెగ తిట్టేసిన బాలీవుడ్ కుర్ర హీరో
X
తరచూ తన వయసు మళ్లిన ప్రియురాలితో చేసే రొమాన్సు విషయానికి సంబంధించిన వార్తలతో దర్శనమిచ్చే బాలీవుడ్ కుర్ర హీరో అర్జున్ కపూర్ తాజాగా అందుకు భిన్నంగా..ఒక సీరియస్ ఇష్యూ మీద చేసిన హాట్ కామెంట్లతో వార్తల్లోకి వచ్చారు. ఇటీవల బాయ్ కాట్ ట్రెండ్ బాలీవుడ్ ను కమ్మేస్తూ..

చిత్ర ఫలితాల్ని డిసైడ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఎవరో ఏదో వాదన వినిపిస్తూ బాయ్ కాట్ అంటూ ప్రచారం మొదలుపెడితే.. దాని మీద అగ్రనటుల సినిమాల కలెక్షన్లు ప్రభావాన్ని చూపుతాయా? అంటూ తేలిగ్గా తీసుకున్న వారికి దిమ్మ తిరిగిపోయే షాకిచ్చింది అమీర్ ఖాన్ లాల్ సింగ్ చద్దా మూవీ ఫలితం.

ఈ సినిమాను బాయ్ కాట్ చేయాలంటూ సోషల్ మీడియాలోనూ.. వాట్సాప్ గ్రూపుల్లో జరిగిన ప్రచారం అంతా ఇంతా కాదు. ఈ సినిమా విడుదల సందర్భంగా తెర మీదకు వచ్చిన వాదనల్ని విన్నప్పుడు.. చాలావరకు కన్వీన్స్ అయ్యేలా చేయటమే కాదు.. ఈ సినిమాకు స్ఫూర్తి అయిన హాలీవుడ్ మూవీ ఫారెస్టు గంప్ చిత్రాన్ని తీసుకోవటంలో జరిగిన తప్పును కొందరు విశ్లేషించిన వైనం ఆకట్టుకోవటమే కాదు.. ఈ సినిమాను చూడకూడదని డిసైడ్ అయిన తీరు బాలీవుడ్ లోని చాలామంది జీర్ణించుకోలేని పరిస్థితి.

తాజాగా ఒక ఇంటర్వ్యూలో బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్ గళం విప్పారు. బాయ్ కాట్ ట్రెండ్ కారణంగా హిందీ చిత్ర పరిశ్రమ పూర్వ వైభవాన్ని కోల్పోతుందన్న ఆయన.. ఈ ట్రెండ్ మీద ఇంతకాలం పెదవి విప్పకుండా తప్పు చేశామంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.

ఈ ఇష్యూ మీద తాము సరిగ్గా ఫోకస్ చేయలేదని.. దీనిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవటంతో కొందరు దీన్నో అవకాశంగా భావిస్తున్నారన్నారు. తమ టాలెంట్ గురించి తాము చేసే సినిమా మాట్లాడుతుందన్న సిద్ధాంతాన్ని నమ్మటంతో సైలెంట్ గా ఉన్నామని.. ఇప్పటికే ఎంతో భరించినట్లుగా పేర్కొన్నారు.

అయితే.. తమ సహకారాన్ని చేతకానితనంగా భావించి.. బాయ్ కాట్ ట్రెండ్ ను అలవాటుగా మార్చుకున్నారని.. అందుకే నటీనటులంతా ఒకే తాటి మీదకు రావాలన్న పిలుపునిచ్చారు. ఇలాంటి ట్రెండ్ ను క్రియేట్ చేస్తున్న వారిపై గట్టి చర్యలు తీసుకునేలా నిర్ణయాలు తీసుకోవాలంటూ మండిపడ్డాడు. బాయ్ కాట్ లాంటి ఇష్యూస్ లో తొందరపడి నోరు విప్పి.. తెలిసి తెలియని మాటలతో కొత్త సమస్యలు తెచ్చుకునే కన్నా.. ఇంతకాలం మెయింటైన్ చేసిన మౌనాన్ని కంటిన్యూ చేస్తే మంచిదన్న విషయాన్ని అర్జున్ కపూర్ మిస్ అయినట్లున్నాడే?