Begin typing your search above and press return to search.
సేఫ్ జోన్ లో షాహిద్..వైఫల్యాన్ని ముందే ఊహించాడా?
By: Tupaki Desk | 8 Aug 2022 8:37 AM GMTబాలీవుడ్ యంగ్ హీరో షాహిద్ కపూర్ బ్యాక్ టూ బ్యాక్ రీమేక్ లతో ఫ్యాన్స్ ని ఫిదా చేస్తున్నాడు. టాలీవుడ్ కల్ట్ క్లాసిక్ `అర్జుర్ న్ రెడ్డి` ని `కబీర్ సింగ్` టైటిల్ తో రీమేక్ చేసి అక్కాడా బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. అటుపై నేచురల్ స్టార్ నాని నటించిన `జెర్సీ`ని అదే టైటిల్ తో రీమేక్ చేసి యావరేజ్ సక్సెస్ అందుకున్నాడు. వాస్తవానికి ఈ రీమేక్ పై షాహిద్ అంచనాలు భారీగానే పెట్టుకున్నాడు.
కానీ ఎందుకనో? వాటిని అందుకోవడంలో వెనుకబడింది. ప్రస్తుతం అలీ అబ్బాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. `నూట్ బ్లాంచ్` అనే ప్రెంచ్ చిత్రానికి రీమేక్ గా తెరకెక్కుతోంది ఈ చిత్రం. ఇంకా హిందీ టైటిల్ ఖరారు చేయలేదు. ప్రెంచ్ రీమేక్ చిత్రాల సక్సెస్ రేట్ కూడా హిందీ పరిశ్రమలో బాగానే ఉంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడుతున్నాయి.
ఇక ఈ సినిమా పూర్తయన వెంటనే మరో రీమేక్ ని షాహిద్ సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు. మలయాళంలో బ్లాక్ బస్టర్ అయిన థ్రిల్లర్ సినిమా `ముంబాయి పోలీస్` చిత్రాన్ని రీమేక్ చేయనున్నారని సమాచారం. మాతృక వెర్షన్ తెరకెక్కించిన రోషన్ ఆండ్రూస్ హిందీ వెర్షన్ కూడా తెరకెక్కించనున్నారుట. రాయ్ కపూర్ ఫిల్మ్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది.
ఇందులో ఓ కీలక పాత్ర కోసం ఓ సౌత్ నటుడ్ని రంగంలోకి దింపే ఆలోచనలో ఉన్నారుట. త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే షాహిద్ ఇలా వరుసగా రీమేక్ చిత్రాలు చేయడంతో అభిమానుల్లో ఒకింత అసహనం వ్యక్తం అవుతుంది. హిందీ స్ర్టెయిట్ స్టోరీల్ని కాదని సౌత్ కంటెంట్ వైపు మెగ్గు చూపడం పట్ల కొంత మంది విమర్శిస్తున్నారు.
అయినా వాటిని ఏమాత్రం పట్టించుకోకుండా సక్సెస్ ఒక్కటే పరమావదిగా షాహిద్ ముందుకు వెళ్తున్నాడు. రెండేళ్లగా బాలీవుడ్ కి ఒక్క విజయం కూడా లేదు. కొన్ని పరిమిత బడ్జటె్ చిత్రాలు మినహా స్టార్ హీరోలు నటించిన చిత్రాలన్ని వైఫల్యాలే. బాక్సాఫీస్ వద్ద ఘోరంగా విఫలమవుతున్నాయి. కోట్ల రూపాయల పెట్టుబడి బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది.
దీనికి కారణం ప్రధానంగా కంటెంట్ లోపమనే విమర్శలు తెరపైకి వచ్చాయి. అమీర్ ఖాన్..సల్మాన్ ఖాన్ లాంటి స్టార్ హీరోలు సైతం ఇదే విషయాన్ని సమర్ధించారు. మరి ఈ విపత్కర పరిస్థితిని షాహిద్ ముందే గమనించాడో ఏమో! తెలివిగా సౌత్ కంటెంట్ ని హిందీకి డబ్ చేసి సక్సెస్ లు అందుకుంటున్నాడు.