Begin typing your search above and press return to search.
ఇంకా అత్తారింటికి హ్యాంగోవర్లోనే
By: Tupaki Desk | 12 July 2017 4:06 AM GMTటాలీవుడ్ లో పవన్ కళ్యాణ్ మూవీ అత్తారింటికి దారేది చిత్రం సృష్టించిన సంచలనాలు అన్నీ ఇన్నీ కావు. 2013లో అప్పటి పరిస్థితుల ప్రకారం అసలు సినిమా రిలీజ్ చేసే పరిస్థితే లేదు. పైగా విడుదల తేదీ నిరవధికంగా వాయిదా వేసిన టైంలో.. మొత్తం మూవీ అంతా హైక్వాలిటీతో నెట్ లో దర్శనమిచ్చేసింది. ఆ ప్రభావంతో హడావిడిగా రిలీజ్ చేయాల్సి వచ్చింది. కానీ మూవీలో ఉన్న కంటెంట్ కారణంగా అత్తారింటికి దారేది మూవీని హడావిడిగా రిలీజ్ చేసినా.. గ్రాండ్ సక్సెస్ సాధించింది.
అయితే.. ఆ విజయం టీం అందరికీ ఇచ్చిన జోష్ అంతా ఇంతా కాదు. ఇప్పుడు మళ్లీ పవన్-త్రివిక్రమ్ ల కాంబనేషన్ లో సినిమా రూపొందుతోంది. మరోసారి ఈ మూవీలో బొమన్ ఇరానీని తీసుకొస్తున్నాడు త్రివిక్రమ్. అత్తారింటికి దారేది చిత్రంలో తాత పాత్రకు ఈయన ప్రాణం పోసిన సంగతి తెలిసిందే. మరోసారి ఆ కాంబినేషన్ అంటే కచ్చితంగా ఆసక్తి పెరుగుతుందనే ఉద్దేశ్యంతోనే ఇలా బొమన్ ఇరానీని తీసుకొచ్చారట. పైగా మూవీకి కీలకంగా ఉండే ఈ పాత్రలో ఈ బాలీవుడ్ నటుడు అయితేనే సరిపోతాడని భావించారట మేకర్స్. కానీ వాస్తవంగా చూస్తే.. పాత సెంటిమెంట్ ను కంటిన్యూ చేస్తున్నారని చెప్పచ్చు.
ఇదంతా చూస్తుంటే.. త్రివిక్రమ్ కానీ.. పవన్ కళ్యాణ్ కానీ అత్తారింటికి దారేది హ్యాంగోవర్ లోనే ఉన్నారని అంటున్నారంతా. నాలుగేళ్ల క్రితం నాటి పరిస్థితి వేరు.. ఇప్పటి సిట్యుయేషన్ వేరు అంటున్నారు సినిమా జనాలు. మరి వాళ్ల సెంటిమెంట్ వర్కవుట్ అవుతుందో.. లేక నిజంగా పాత్ర డిమాండ్ చేసిందనే బొమన్ ఇరానీని తీసుకొచ్చారో మూవీ చూస్తే కానీ తెలియని విషయం. ఇప్పటికే ఈ బాలీవుడ్ యాక్టర్ హైద్రాబాద్ లో షూటింగ్ స్టార్ట్ చేసేశాడు.