Begin typing your search above and press return to search.
సల్మాన్ ఇంట్లో బాంబ్.. పోలీసులకు సవాల్
By: Tupaki Desk | 14 Dec 2019 11:09 AM GMTనిండా పదహారు ఏళ్లు కూడా లేవు. కానీ ఏకంగా సల్మాన్ ఖాన్ ఇంట్లోనే బాంబు పెట్టేశారు. పోలీసులను హైరానా పెట్టించాడు. ముంబైలోని సల్మాన్ ఇంటిని హుటాహుటిన ఖాళీ చేసిన పోలీసులు ఇల్లంతా గాలించినా బాంబు కనిపించకపోయేసరి ఊపిరి పీల్చుకున్నారు..ఈ పని చేసింది ఎవరని ఆరాతీస్తే సంచలన విషయం వెలుగులోకి వచ్చింది.
ముంబైలోని బాంద్రాలో గల గెలాక్సీ అపార్ట్ మెంట్ లోని సల్మాన్ ఖాన్ ఇంట్లో బాంబు పెట్టామని.. రెండు గంటల్లో పేలనుందని..దమ్ముంటే ఆపాలని బాంద్రా పోలీస్ స్టేషన్ కు ఈమెయిల్ వచ్చింది. మెయిల్ చూసిన పోలీసులు సల్మాన్ తండ్రి సలీమ్, సోదరి అర్పితను సురక్షిత ప్రాంతానికి తరలించి ఇంటిని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. బాంబు లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు..
ఈ మెయిల్ ఆధారంగా ఈ మెయిల్ చేసింది ఘజియాబాద్ కు చెందిన ఒక 16 ఏళ్ల బాలుడి పని అని గుర్తించారు. అతడి కోసం పోలీసులు వెళ్లగా పారిపోయాడు. చివరకు బాలుడి సోదరుడి ద్వారా బయటకు రప్పించి అరెస్ట్ చేశారు. గతంలోనూ ఇలా ఘజియాబాద్ పోలీస్ స్టేషన్ కు మెయిల్స్ పంపించాడని విచారణలో తేలింది. చార్జిషీట్ దాఖలు చేసి కోర్టులో ప్రవేశపెట్టగా విడిచిపెట్టాలని పోలీసులను కోర్టు ఆదేశించింది.