Begin typing your search above and press return to search.

బాల‌ల విశృంఖ‌ల‌తకు తాఖీ‌దు! వివాదంలో నెట్ ఫ్లిక్స్ సిరీస్ `బాంబే బేగ‌మ్స్`!!

By:  Tupaki Desk   |   16 March 2021 11:30 PM GMT
బాల‌ల విశృంఖ‌ల‌తకు తాఖీ‌దు! వివాదంలో నెట్ ఫ్లిక్స్ సిరీస్ `బాంబే బేగ‌మ్స్`!!
X
నెట్ ఫ్లిక్స్ సిరీస్ ల వ‌రుస వివాదాల గురించి తెలిసిన‌దే. ఇప్పుడు మ‌రో వివాదం అంత‌ర్జాలంలో అగ్గి రాజేస్తోంది. 2007 లో భారత పార్లమెంటు చట్టం ప్రకారం ఏర్పడిన ఎన్‌ సిపిసిఆర్ వివాదాస్ప‌ద సిరీస్ `బాంబే బేగమ్స్‌` సిరీస్ ని నిర్మించిన నెట్ ఫ్లిక్స్ విభాగానికి గురువారం లీగల్ నోటీసు జారీ చేసింది. నెట్ ఫ్లిక్స్ పిల్లలనుద్ధేశించి అనుచితంగా స‌న్నివేశాల‌ను చిత్రీకరించి ప్ర‌ద‌ర్శించింద‌ని వెంట‌నే ఈ ప్రదర్శనను ప్రసారం చేయవ‌ద్ద‌ని ఈ నోటీసుల్లో కోరింది. బాల‌ల‌పై ఇలాంటి సిరీస్ లు దారుణ స‌న్నివేశాల్ని చూపించ‌డం స‌రికాద‌ని ఈ నోటీసులో పేర్కొన్నారు.

ఈ సిరీస్ లో నేటి పట్టణ పరిసరాల మహిళల వాస్తవిక జీవితాల‌ చిత్రణను అందించినందుకు ప్రశంసలు అందుకున్నా కానీ ఇంత‌లోనే బాల‌ల విష‌యంలో అనుచిత వ్య‌వ‌హారం వెలుగులోకి వ‌చ్చింది. బొంబాయి(బాంబే) బేగ‌మ్స్ కు అలంకృత శ్రీవాస్తవ్ దర్శకత్వం వహించారు.

గత నెలలో అమెజాన్ ప్రైమ్ పై పొలిటికల్ థ్రిల్లర్ తాండవ్ ప్రసారం వివాదాస్పదంగా ఉండగా.. ఇప్పుడు బాంబే బేగమ్స్ (నెట్ ఫ్లిక్స్) నేషనల్ కమిషన్ ఫర్ ది ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ (ఎన్ సిపిసిఆర్) తో ఓవర్-ది -టాప్ లో ఒక కొత్త ప్రదర్శనను ఆపేందుకు ఉద్య‌మిస్తోంది.

బాంబే బేగమ్స్.. అస‌లు ఏమిటి? అన్న‌ది చూస్తే..
ఎనిమిది భాగాల సిరీస్ ఇది. ముంబైలోని పెద్ద చెడ్డ ప్రపంచంలో నివసిస్తున్న లేదా పనిచేసే డ్రీమ‌ర్స్ అయిన‌ ఐదుగురు పట్టణ మహిళల కథ. అన్ని వయసులవారు ఇందులో ఉంటారు. మోస్ట్ ప‌వ‌ర్ ఫుల్ సిఇఒ నుండి ముంబైకి కొత్తగా వచ్చిన వ్యక్తి,.. మధ్య కెరీర్ మహిళ .. మాజీ బార్ డాన్సర్ ఇలా బేగమ్స్ టీమ్ రెడీ అవుతుంది.

ఈ సిరీస్ ఆద్యంతం పట్టణ మహిళల పోరాటాలు.. కలలు ..కోరికలు అన్నిటినీ ఆవిష్క‌రిస్తుంది. వారంతా ఎలా క‌లిసారు? ప్ర‌తి సంద‌ర్భాన్ని ఎలా ఢీకొన్నారు? చివరికి ఈ పోరాట ఫ‌లితం ఎలా ఉంది? అన్న‌దే సిరీస్.

పిల్లల హక్కుల సంఘం తగిన చట్టపరమైన చర్యలను తీసుకునేందుకు సిద్ధ‌మైంది. ఇందులో కంటెంట్ యువత‌ను కలుషితం చేస్తుంది. పిల్లలకు చెడు చేస్తుంద‌ని కమిషన్ తెలిపింది. నెట్ ‌ఫ్లిక్స్ పిల్లల విషయంలో లేదా పిల్లల కోసం ఏదైనా కంటెంట్ ను ప్రసారం చేసేటప్పుడు అదనపు జాగ్రత్తలు తీసుకోవాలి అని హెచ్చ‌రించింది. మైనర్లకు లైంగిక కార్యకలాపాలకు సిద్ధ‌మ‌వ్వ‌డం.. మదకద్రవ్యాలను సేవించ‌డం వంటి స‌న్నివేశాల‌పైనా కమిషన్ విమర్శించింది.