Begin typing your search above and press return to search.

'ది కశ్మీర్ ఫైల్స్' సినిమాపై బొంబే హైకోర్టు సంచలన నిర్ణయం

By:  Tupaki Desk   |   8 March 2022 2:32 PM GMT
ది కశ్మీర్ ఫైల్స్ సినిమాపై బొంబే హైకోర్టు సంచలన నిర్ణయం
X
'ది కశ్మీర్ ఫైల్స్' సినిమా ఇప్పుడు దేశవ్యాప్తంగా వివాదాస్పదమైంది. ఇటీవల విడుదలైన ట్రైలర్ దుమారం రేపింది. అందులో ముస్లింల మనోభావాలను దెబ్బతీసేలా ఉందంటూ పలువురు కోర్టుకు ఎక్కారు. బొంబే హైకోర్టులో ఈ మేరకు పిటీషన్లు దాఖలు చేశారు. తాజాగా ఈ పిటీషన్ ను బొంబే హైకోర్టు కొట్టివేసింది. సినిమాను ఆపివేయాలన్న పిటీషన్ సరికాదని స్పష్టం చేసింది. మార్చి 11కు రిలీజ్ కు రెడీ అయిన సినిమా విడుదలకు ఓకే చెప్పింది.

'ది కశ్మీర్ ఫైల్స్' పై అనవసర రాద్ధాంతం చేస్తున్నారని చిత్ర దర్శకుడు వివేక్ అగ్ని హోత్రి మండిపడ్డారు. ప్రతీ ఫేమ్, ప్రతీపదం వాస్తవమని.. ఎక్కడైనా చివరకు కోర్టులో అయినా నిరూపించేందుకు తాను సిద్ధమన్నారు.

సినిమా విడుదలను నిలిపివేయాలంటూ ఇంతేజార్ హుస్సేన్ సయ్యద్ అనే వ్యక్తి పిటీషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. సయ్యద్ ఆరోపణలన్ని కొట్టిపారేసిన హైకోర్టు సినిమా విడుదలకు రెడీ అయ్యింది.

-'ది కశ్మీర్ ఫైల్స్' సినిమా ఎందుకు వివాదమైంది?
ది కశ్మీర్ ఫైల్స్ సినిమాలో కశ్మీరీ హిందువులపై జరిగిన మారణహోమాన్ని కళ్లకు కట్టాడు అగ్నిహోత్రి. సినిమా నిలుపుదల చేయాలంటూ కొందరు కోర్టుకెళ్లారు. తాను సినిమాలో చూపించిన ప్రతీ ఫ్రేమ్ నిజమని ఏ వేదికనుంచైనా నిరూపించేందుకు సిద్ధమని దర్శకుడు వివేక్ అగ్ని హోత్రి సవాల్ చేశాడు. పిటీషన్ వేయడం ద్వారానో, మరో రకంగానో అడ్డంకులు సృష్టించే ప్రయత్నాలు చేస్తున్నారని.. తాను ఎట్టి పరిస్తితుల్లోనూ మౌనంగా ఉండబోనని అన్నాడు.

ట్రైలర్ లో చూపిన సన్నివేశాలు మత హింసను ప్రేరేపించేలా ఉన్నాయంటూ పిల్ వేశారు సయ్యద్. జాతి వివక్షతో కూడిన డైలాగులు ఉన్నాయంటున్నారు. సినిమా ట్రైలర్ ఫిబ్రవరి 21న యూట్యూబ్ లో విడుదలైంది.

జీ స్టూడియోస్ దాన్ని అప్ లోడ్ చేసింది. మొదట్లోనే బ్యాక్ డ్రాప్ వాల్ పై ముసల్మాన్ జాగో కాఫీర్ అంటే హిందువులు భాగో అని రాసి ఉన్న గ్రాఫిక్ ను సయ్యద్ ప్రస్తావిస్తూ మతాల మధ్య విద్వేషాలు పెంచేలా ఉందన్నారు. సినిమా వల్ల దేశంలో మత హింస చెలరేగే ప్రమాదం ఉందని కోర్టుకెళ్లాడు. సినిమా విడుదలను ఆపాలన్నారు. యూట్యూబ్ లో ట్రైలర్ తొలగించాలని కోరాడు. అయితే ఈ పిటీషన్ ను హైకోర్టు కొట్టివేసింది.