Begin typing your search above and press return to search.

ప్రేమపక్షులు స్వేచ్ఛా విహారం కేన్స్‌లోనే

By:  Tupaki Desk   |   11 April 2015 9:30 AM GMT
ప్రేమపక్షులు స్వేచ్ఛా విహారం కేన్స్‌లోనే
X
ప్రేమికులు అంటే చాటుమాటున కలుసుకోవాల్సిందే. ఓపెన్‌ అయితే బోలెడన్ని ఇక్కట్టు. అయితే ఇదంతా ఇండియాలో ఉన్నంత సేపే. అదే విదేశాల్లో అయితే అన్ని కఠిన నిబంధనలు ఉండవు. అడ్డంకులు ఉండవు. బంధనాలు అసలే వేయరు. అందుకే మన దేశంలో ప్రేమించుకునే సెలబ్రిటీలంతా విదేశాలు వెళ్లి స్వేచ్ఛా విహారం చేసి వస్తుంటారు. ఆ కోవలోనే రణబీర్‌, కత్రినకు ఓ అవకాశం వచ్చింది. త్వరలో కేన్స్‌ చలనచిత్రోత్సవాలు ఫ్యారిస్‌లో వేదికగా జరగనున్నాయన్న సంగతి తెలిసిందే. ఈ వేడుకల్లో రణబీర్‌ కపూర్‌ నటించిన 'బాంబే వెల్వెట్‌' ప్రదర్శనకు వెళుతోంది. తన సినిమా వెళుతోంది కాబట్టి తాను అక్కడికి బయల్దేరుతున్నాడు రణబీర్‌. అయితే యాధృచ్ఛికమో ఏమో! అదే సమయంలో ఫ్యారిస్‌లోని ఓ ఫ్యాషన్‌ షోలో పాల్గొనడానికి క్యూట్‌ కత్రినకైఫ్‌ వెళుతోంది. అంటే ఫ్యాషన్‌ షో వంకతో రణబీర్‌ని కలవడానికే కత్రిన అక్కడికి వెళ్లిందని అనుకోవచ్చు. ఏదేమైనా ప్రేమపక్షుల స్వేచ్ఛా విహారానికి కేన్స్‌ చలనచిత్రోత్సవాలు వేదిక కానున్నాయి. అక్కడ ఎవరేం చేసినా పట్టించుకునేవాళ్లే ఉండరు. ఒకవేళ బాలీవుడ్‌ మీడియా అక్కడే ఉంటే గనుక ఈ ఇద్దరిపైనే కన్నేసి ఉంచుతుంది. ఫలానా హోటల్‌లో రచ్చ చేశారనో.. లేదా ఇంకేదైనా పేరుతో రచ్చ రచ్చ చేయడం ఖాయం.