Begin typing your search above and press return to search.
బొంభట్ గా ఉందిరో.. ఈ పాటేదో
By: Tupaki Desk | 14 Jun 2017 4:44 AM GMTహీరో నితిన్ కొత్త చిత్రం 'లై' చేస్తున్న సంచలనం ఇప్పుడు సోషల్ మీడియా లోనూ మ్యూజిక్ లవర్స్ లోనూ కొత్త టాపిక్ గా మారింది. ఈ సినిమా షూటింగ్ మొదలుపెట్టినప్పటి నుండి వస్తున్న వార్తలు తెలుస్తున్న విశేషాలు బట్టి లై పై అంచనాలు రానురాను పెరుగుతున్నాయి. నితిన్ స్టైలిష్ లుక్ హను రాఘవపూడి మేకింగ్ అన్నీ కలిపి సినిమాకు మంచి మార్కెట్ ఏర్పడింది. ఇప్పుడు వీళ్ళ ఉత్సాహంకు మరింత శక్తి ఇచ్చాడు స్వర బ్రహ్మ మణి శర్మ.
నిన్నే ఈ సినిమా నుండి 'బొంభాట్' అనే పాటను విడుదల చేశారు చిత్ర బృందం అంతా కలిసి. ఈ పాట ఇప్పుడు యూట్యూబ్ లో మంచి ట్రెండింగ్ అవుతుంది. 'అదర నా గుండెలదర నిదుర కంటికి రాదు' అని తెలంగాణ గొంతు పరిమళంతో ఆలాపనతో మొదలై “బొమ్మల్లే ఉంది పోరి బొంభట్ గా ఉంది నారీ” అని జానపదం పదాలతో వెస్ట్రన్ మ్యూజిక్ ను ప్రాంతీయ సంబంధమైన సంగీతాన్ని కలిపి మణి శర్మ తన అనుభవాన్ని పూర్తిగా వాడి అదరగొట్టాడు. పాట లో ఎప్పుడో మరిచిన వాద్యాలు హార్మోనియం వంటి శబ్దాలును మళ్ళీ వినిపించి చెవులుకు కింపైన సంగీతం ఇచ్చారు మణి శర్మ. తెలంగాణ యాస ఇంటర్నెట్ తో పుట్టుకు వచ్చిన కొత్త కంప్యూటర్ పదాలు కలిపి ఇప్పటి యూత్ కు ఊపు వచ్చేలా ఉందిలే. చూస్తుంటే మళ్ళీ నితిన్ మ్యూజికల్ హిట్ కొట్టినట్లేనేమో.
ఇకపోతే ఆల్రెడీ సినిమాను ఆగస్టు 11న రిలీజ్ చేయడానికి సిద్దం చేసిన సంగతి తెలిసిందే.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/