Begin typing your search above and press return to search.

ర‌జ‌నీ X క‌మ‌ల్! ఈనాటి ఈ బంధం ఏనాటిదో!

By:  Tupaki Desk   |   29 May 2022 10:30 AM GMT
ర‌జ‌నీ X క‌మ‌ల్! ఈనాటి ఈ బంధం ఏనాటిదో!
X
విశ్వ‌నటుడు కమల్ హాసన్ ప్ర‌స్తుతం `విక్రమ్` ప్రచార కార్య‌క్ర‌మాల్లో బిజీబిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. దేశ‌వ్యాప్తంగా ప‌లు న‌గ‌రాల‌కు ప్ర‌యాణించి అభిమానుల్ని క‌లుస్తున్నారు. ఉల‌గ‌నాయ‌గ‌న్ ప్రస్తుతం తన సినిమా ప్రమోషన్స్ కోసం కేరళలో ఉన్నారు. ప్రమోషన్ కోసం గతంలో ముంబై- ఢిల్లీ వెళ్లాడు. విక్రమ్ జూన్ 3న ప్రపంచవ్యాప్తంగా 5 భాషల్లో థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. కమల్ హాసన్‌ స్వయంగా ఈ చిత్రాన్ని మూడు భాషల్లోకి డబ్బింగ్‌ చేశారు.

విక్ర‌మ్ ప్ర‌చార కార్య‌క్ర‌మాల్లో రజనీకాంత్ తో తన స్నేహం గురించి తలెత్తే ప్రశ్నలకు నిరంతరం సమాధానం ఇస్తూనే ఉన్నారు. కమల్ హాసన్ చాలా సంవత్సరాలుగా అనేక అవార్డు ఫంక్షన్లలో ఈవెంట్లలో ఇంటర్వ్యూలలో కూడా రజనీకాంత్‌ తో తన స్నేహానుబంధం గురించి బహిరంగంగా మాట్లాడారు. ఇటీవలి ఇంటర్వ్యూలో ఇరువురి రాజకీయ సిద్ధాంతాలు భిన్నంగా ఉన్నప్పటికీ వారు ఇప్పటికీ సన్నిహితంగా ఉన్నామ‌ని సంవత్సరాలుగా తమ స్నేహానికి ఎప్పుడూ బ్రేక‌ప్ అన్న‌ది లేద‌ని చెప్పారు.

తాజాగా దర్శకుడు లోకేష్ కనగరాజ్ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో ర‌జ‌నీతో తాను ఉన్న ఫోటోగ్రాఫ్ ని అలాగే సూపర్ స్టార్ రజనీకాంత్ తో క‌మ‌ల్ హాస‌న్ క‌లిసి ఉన్న‌ మ‌రో ఫోటోని కూడా షేర్ చేసారు. ఇద్ద‌రు లెజెండ్స్ ఒకే ఫ్రేమ్ లో ఎంతో డిగ్నిఫైడ్ గా క‌నిపిస్తున్నారు. ఈ ఫోటోని షేర్ చేసిన దర్శకుడు లోకేష్ క‌న‌గ‌రాజ్ మాట్లాడుతూ.. ఆ ఇద్ద‌రి స్నేహం తనకు ప్రేర‌ణ‌గా నిలిచిందని అన్నారు.

కమల్ హాసన్ క‌థానాయ‌కుడిగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వ‌హించిన విక్రమ్ ఈ సీజ‌న్ లో ఎలాంటి స‌క్స‌స్ ని అందిస్తుందో వేచి చూడాలి. గ‌త కొంత‌కాలంగా క‌మ‌ల్ కి ఆశించినంత పెద్ద హిట్టు రాలేదు. ఈ మూవీతో ఆ లోటు తీరుతుందా లేదా? అన్న‌దానికి కాల‌మే స‌మాధానం చెప్పాల్సి ఉంటుంది. ఈ చిత్రంలో ఫహద్ ఫాసిల్ - విజయ్ సేతుపతి కూడా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇంత‌కుముందు విడుద‌లైన ట్రైల‌ర్ ఆక‌ట్టుకుంది.

`విక్రమ్` రైట్స్ యువ‌హీరోకి..

విక్ర‌మ్ మూవీని తెలుగులో యువ‌హీరో నితిన్ రిలీజ్ చేస్తుండ‌డం ఆస‌క్తిని క‌లిగిస్తోంది. టాలీవుడ్ యూత్ స్టార్ నితిన్ హోమ్ బ్యానర్ శ్రేష్ఠ్ మూవీస్ `విక్రమ్` తెలుగు హక్కులను సొంతం చేసుకుంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా భారీగా థియేటర్లలో విడుదల కానుంద‌ని స‌మాచారం. నితిన్ స్వ‌యంగా పూనుకుని విక్ర‌మ్ కి ప్ర‌మోష‌న్ చేయ‌నున్నారు. ఇటీవ‌లే విడుద‌లైన‌ ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంది.

పోటీబ‌రిలో మేజ‌ర్ ..!

క‌మ‌ల్ హాస‌న్ `విక్ర‌మ్` మూవీని పాన్ ఇండియా మార్కెట్ లక్ష్యంగా విడుద‌ల చేస్తున్నారు. ఈ సినిమాతో యువ‌హీరో అడివి శేష్ న‌టించిన మేజ‌ర్ పోటీప‌డ‌నుంది. విక్ర‌మ్ తో పాటు మేజ‌ర్ అదే రోజు విడుద‌ల‌వుతుండ‌డంతో ఈ రెండు సినిమాల‌పైనా ఆస‌క్తి నెల‌కొంది. ముఖ్యంగా విక్ర‌మ్ త‌ర‌హాలోనే మేజ‌ర్ పాన్ ఇండియా కేట‌గిరీలో ప‌లు భాష‌ల్లో విడుద‌ల‌వుతోంది. బాక్సాఫీస్ వ‌ద్ద పోటీ ఎలా సాగ‌నుందో వేచి చూడాల‌న్న ఆస‌క్తి నెల‌కొంది.