Begin typing your search above and press return to search.

సౌత్ సినిమాని ఆకాశానికెత్తేసి బాలీవుడ్ పై చిన్న‌చూపు!

By:  Tupaki Desk   |   8 March 2022 1:30 AM GMT
సౌత్ సినిమాని ఆకాశానికెత్తేసి బాలీవుడ్ పై చిన్న‌చూపు!
X
నార్త్ నుంచి వ‌చ్చి సౌత్ క‌రెన్సీ వాస‌న ఎలా ఉంటుందో చూస్తున్నారు బాలీవుడ్ అగ్ర నిర్మాత బోనీ క‌పూర్ జీ. అటు త‌మిళం ఇటు తెలుగులో అగ్ర హీరోల‌తో స‌త్సంబంధాల‌ను క‌లిగి ఉన్న బోనీ క‌పూర్ ఇటీవ‌ల వ‌రుస బ్లాక్ బ‌స్ట‌ర్ల రుచి ఎలా ఉంటుందో చ‌వి చూస్తున్నారు.

రొటీన్ మోనోట‌నీతో ఇబ్బందుల్లో ఉన్న బాలీవుడ్ ని ప‌క్క‌న పెట్టి ఆయ‌న పూర్తిగా సౌత్ పై దృష్టి సారించారు. త‌ళా అజిత్ హీరోగా పింక్ చిత్రాన్ని త‌మిళంలో రీమేక్ చేసి బంప‌ర్ హిట్ కొట్టారు. బోనీకి భారీ లాభాలిచ్చిది ఈ సినిమా.

ఇక తెలుగులో పింక్ చిత్రాన్ని ప‌వ‌న్ క‌ల్యాణ్ తో వ‌కీల్ సాబ్ టైటిల్ తో రీమేక్ చేసి హిట్ కొట్టారు. ఇటీవ‌ల అజిత్ హీరోగా న‌టించిన వాలీమైని భాగ‌స్వాముల‌తో క‌లిసి నిర్మించారు బోనీ.

మునుముందు తెలుగు-త‌మిళం- హిందీ భాష‌ల‌ను క‌లుపుతూ భారీ పాన్ ఇండియా సినిమాల్ని నిర్మించాల‌న్న ప్ర‌ణాళిక‌తో ఉన్నారు. కార‌ణం ఏదైనా కానీ సౌత్ సినిమాతో బోనీక‌పూర్ అనుబంధం విడ‌దీయ‌రానిది. తాజాగా ఆయ‌న చేసిన ఓ వ్యాఖ్య సౌత్ లో సంచ‌ల‌నంగా మారింది.

దక్షిణ భారత సినిమా నిజమైన భారతీయ సినిమా. భారతీయ సినిమాకు బాలీవుడ్ చిరునామాగా భావించే రోజులు పోయాయి... అంటూ బోనీజీ సంచ‌ల‌న వ్యాఖ్య చేశారు. హిందీ చిత్రాలకు ఆదరణ బాగా తగ్గింది. దక్షిణాది నుండి వచ్చిన చిత్రాలతో పోల్చినప్పుడు ఎవరి నుండి ఆసక్తికరంగా ఏమీ అంద‌డం లేదు అనే అర్థంలో బోనీ మాట్లాడారు.

బాలీవుడ్ ప్రముఖ నిర్మాత బోనీ కపూర్ తనదైన శైలిలో సౌత్ ఇండియన్ సినిమాపై ప్రశంసలు కురిపించారు. మీడియాతో ఆయ‌న మాట్లాడుతూ..``ఈరోజు ముంబయి చిత్రనిర్మాతలలో కొందరు... KFC... లాంటివి ఆర్డర్ చేసినవి మాత్రమే లభిస్తాయి. అయితే... దక్షిణాదిన‌ మీకు రోటీ- దాల్-చావల్... చికెన్ తో థాలీని అందిస్తాయి. ...సౌత్ ఫిల్మ్స్ ఇండియన్ ఆడియన్స్ కోసం తీస్తున్న‌వి`` అంటూ పొగిడేశారు.

ఇది చాలా వరకు నిజం. మలయాళ సినిమా OTT సర్క్యూట్ ని ఏల్తుండ‌గా.. తెలుగు నుంచి వెళ్లిన‌వి చెత్త సమయాల్లో (క‌రోనా స‌హా వ‌ర‌ద‌ల్లోనూ) కూడా థియేటర్ ల‌లో స‌త్తా చాటుతున్నాయి. బాహుబ‌లి - సాహో- పుష్ప వంటి సంచ‌ల‌న విజ‌యాల‌తో హిందీ ప‌రిశ్ర‌మను తెలుగు చిత్రీసీమ షేక్ చేసింది.

తమిళ సినిమా కూడా తన స్టైల్ లో పోటీ పడుతూ డబ్బింగ్ చిత్రాలతో నార్త్ ప్రేక్షకులపై మంచి పట్టు సాధిస్తోంది. ఈ రోజుల్లో కన్నడ చిత్ర పరిశ్రమ కూడా కొన్ని పాన్ ఇండియన్ చిత్రాలతో తన సత్తాను చాటుతోంది. వీటన్నింటితో బాలీవుడ్ ని చిన్నచూపు చూసిన సౌత్ ఇండియన్ సినిమాని రియల్ ఇండియన్ సినిమా అని చెప్పొచ్చు.

బోనీజీ మీరు చెప్పిన‌ది వంద శాతం నిజం! దీనిని మ‌రో లెవ‌ల్ కి తీసుకెళ్లేందుకు హిందీ అగ్ర నిర్మాత‌లు తెలుగు అగ్ర నిర్మాత‌ల‌తో క‌లిసి పాన్ ఇండియా చిత్రాల‌కు ప్లాన్ చేయ‌డం అత్యావ‌శ్య‌కం అనే చెప్పాలి.