Begin typing your search above and press return to search.
బోనీ కపూర్ ఫ్యామిలీకి దుబాయ్ గోల్డెన్ వీసా వచ్చేసింది
By: Tupaki Desk | 15 Sep 2021 7:37 AM GMTడబ్బులకు దాసోహం అనని వారు ఉండరు. వ్యక్తులే కాదు.. ప్రభుత్వాలు సైతం ఇంతే అన్నది నిజం. ఈ విషయం పలు అంశాల్లో స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. కఠినమైన చట్టాలకు కేరాఫ్ అడ్రస్ గా ఉండే దుబాయ్ లోనూ.. డబ్బులున్న మారాజుల విషయంలో ఆ దేశం వ్యవహరిస్తూ ఉంటుంది. తాజాగా ఆ దేశం ఇచ్చే గోల్డెన్ వీసాను తాజాగా బోనీ కపూర్ కుటుంబానికి ఇచ్చారు.
దీనికి బోనీ కపూర్ స్పందించారు. అరుదైన గౌరవాన్ని అందించినందుకు దుబాయ్ ప్రభుత్వానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. నిజంగానే.. ఈ గోల్డెన్ వీసా అరుదైనదా? అంటే కాదనే చెప్పాలి. ఎందుకంటే 10 లక్షల ఎమిరేటీ దిర్హమ్ పెట్టబుడులు పెట్టిన వ్యాపారులతో పాటు వివిధ రంగాలకు చెందిన ప్రతిభావంతులకు ఈ వీసాను అందిస్తారు.
ఈ వీసా జీవిత కాలం ఐదేళ్లు.. పదేళ్లుగా ఉంటుంది. కాకుంటే.. గడువుముగిసిన తర్వాత కూడా దాన్ని పునరుద్ధరిస్తారు. బాలీవుడ్ లో బోనీ కపూర్ ఫ్యామిలీకి ఉన్న గుర్తింపు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దీనికి తోడు దుబాయ్ ప్రభుత్వం కోరినంత మొత్తాన్ని కట్టేసిన తర్వాత.. గోల్డెన్ వీసా జారీ చేయటం పెద్ద విషయమేమీ కాదన్న మాట వినిపిస్తోంది. గతంలో ఈ తరహా వీసాను బాలీవుడ్ నటులు షారూఖ్ ఖాన్.. సంజయ్ దత్.. సునీల్ శెట్టితో పాటు మలయాళ సినీ రంగానికి చెందిన ప్రముఖ నటులు మమ్ముట్టి.. మోహన్ లాల్ కు ఈ గోల్డెన్ వీసాలు మంజూరయ్యాయి. తాజాగా ఈ జాబితాలోకి బోనీ ఫ్యామిలీ కూడా చేరిందని చెప్పాలి.