Begin typing your search above and press return to search.
టాప్ స్టోరి: మరణంతో పెను బంధం
By: Tupaki Desk | 29 July 2018 1:30 AM GMTఅంతవరకూ రెండు ఫ్యామిలీలు. చిన్న ఇల్లు - పెద్ద ఇల్లు.. ఇవి రెండూ వేర్వేరు. ఇప్పుడు ఒకే ఇల్లు.. ఒకటే ఫ్యామిలీ.. ఈ మార్పు ఒక పెనువిషాదం తర్వాత. ఒక ప్రాణం ఇహలోకాన్ని వీడి పరలోకం వెళ్లిపోయాక అనూహ్యమైన మార్పు ఇది.
విషాదం పాత బంధాల్ని కలుపుతుందని అంటారు. ఇప్పుడు అదే జరిగింది. మామ్ శ్రీదేవి మరణం కపూర్ ఫ్యామిలీలో ఎంతో మార్పు తెచ్చింది. నలుగురు పిల్లలతో బోనీకపూర్ ఒకే ఇంట్లో ఉంటున్నాడు. అసలు చెల్లెళ్లతో మాట్లాడని అన్న అర్జున్ కపూర్ ఇప్పుడు జాన్వీ - ఖుషీలను కలుపుకుని సంరక్షకుడిగా ఉంటున్నాడు. శ్రీదేవి మరణం తర్వాత కపూర్ ఫ్యామిలీలో కొత్త పరిణామమిది. ప్రస్తుతం దీనిపై బాలీవుడ్ లో సర్వత్రా ఆసక్తికర చర్చ సాగుతోంది. ఒకే ఇంటి కప్పు కింద అర్జున్ కపూర్ - అతడి సోదరి అన్షులా కపూర్ - మామ్ బిడ్డలు జాన్వీ - తన సోదరి ఖుషీ నలుగురూ ఉన్నారిప్పుడు. వీళ్లకు పెద్దగా బోనీకపూర్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ముగ్గురు చెల్లెళ్లను అన్న అర్జున్ కంటి పాపలా చూసుకుంటున్నాడు. ఇంతలోనే ఎంత మార్పు. మామ్ శ్రీదేవి ఉన్నంతకాలం ఆ చెల్లెళ్లే శత్రువులు అయ్యారు. ఆ ఇల్లు దూరంగానే ఉండేది. కానీ తను లేదిప్పుడు. అందుకే కలిసిపోయారు. లేదు కలుపుకున్నారంటే కరెక్ట్. మనిషై పుట్టాక ఇంతే. మనిషి ఉన్నప్పుడు ఒకలా.. లేనప్పుడు ఇంకోలా. అదే మాయదారి లోకం అవిభాజ్య నీతి!! ఏమంటారు?