Begin typing your search above and press return to search.
శ్రీదేవి భర్త మళ్లీ పవన్ తో మూవీ?
By: Tupaki Desk | 30 Jun 2021 12:30 AM GMTబాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన పింక్ ను తెలుగు మరియు తమిళ రీమేక్ రైట్స్ ను దక్కించుకుని శ్రీదేవి భర్త బోనీ కపూర్ రీమేక్ చేసిన విషయం తెల్సిందే. తమిళంలో సొంతంగానే రీమేక్ చేసిన బోనీ కపూర్ తెలుగులో మాత్రం దిల్ రాజు తో కలిసి నిర్మించాడు. వకీల్ సాబ్ నిర్మాణంలో బోనీ కపూర్ భాగస్వామ్యం కొద్ది మొత్తం మాత్రమే. కాని త్వరలోనే ఆయన పూర్తి స్థాయిలో తెలుగులో ఒక సినిమాను రీమేక్ చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. మలయాళంలో సూపర్ హిట్ అయిన '1' సినిమా రీమేక్ రైట్స్ ను బోనీ కపూర్ దక్కించుకున్నాడు.
ఇండియాలోని అన్ని భాషల్లో రీమేక్ చేసేందుకు గాను ఆయన హోల్ సేల్ గా రీమేక్ రైట్స్ ను దక్కించుకున్నాడు. హిందీలో మొదట ఈ సినిమాను రీమేక్ చేసి ఆ తర్వాత తమిళం మరియు తెలుగులో కూడా రీమేక్ చేసే ఉద్దేశ్యంతో ఆయన ఉన్నాడని తెలుస్తోంది. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ తో రూపొందిన వన్ సినిమా లో మమ్ముటీ సీఎంగా కనిపించాడు. అవినీతి మంత్రులు.. వారిపై చర్యల నేపథ్యంలో సాగే ఈ సినిమా మలయాళంలో మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. డైరెక్ట్ ఓటీటీ ద్వారా విడుదల అయిన ఈ సినిమా కు సంతోష్ విశ్వనాథ్ దర్శకత్వం వహించాడు.
తెలుగు లో ఈ సినిమాను పవన్ కళ్యాణ్ తో రీమేక్ చేస్తే బాగుంటుందనే అభిప్రాయంతో బోనీ కపూర్ ఉన్నాడట. త్వరలోనే సినిమా రీమేక్ పనులు మొదలు పెట్టబోతున్నాడు. వకీల్ సాబ్ తరహాలోనే తెలుగు నిర్మాతతో కలిసి ఈ సినిమాను ఆయన రీమేక్ చేస్తాడా లేదంటే సొంతంగా రీమేక్ చేస్తాడా అనేది తెలియాల్సి ఉంది. ఈ సినిమా రీమేక్ కు పవన్ ఒప్పుకుంటాడా అనేది చూడాలి. పింక్ తో పాటు అయ్యప్పనుమ్ కోషియుమ్ సినిమా ను కూడా పవన్ రీమేక్ చేస్తున్నాడు.
రీమేక్ విషయంలో పవన్ ఈమద్య సానుకూలంగా ఉంటున్నాడు. కనుక వన్ రీమేక్ లో కూడా నటిస్తే బాగుంటుందని అభిమానులు అంటున్నారు. పవన్ ఒప్పుకుంటే బోనీ కపూర్ కు మళ్లీ ఆయనతో సినిమా చేసే అకాశం దక్కుతుంది. మరి ఇది ఎంత వరకు వర్కౌట్ అవుతుంది చూడాలి. హిందీలో ఈ రీమేక్ ను వచ్చే ఏడాది ఆరంభంలో మొదలు పెట్టబోతున్నట్లుగా తెలుస్తోంది.