Begin typing your search above and press return to search.
అలాంటి చెత్త స్టోరీలకు నేను స్పందించను
By: Tupaki Desk | 13 July 2019 4:26 AM GMTగత ఏడాది ఫిబ్రవరిలో మృతి చెందిన శ్రీదేవిది సహజ మరణం కాదని ఆమెను ఎవరైనా హత్య చేసి ఉంటారు అంటూ కేరళ జైళ్ల శాఖ డిజిపి రిషిరాజ్ సింగ్ అభిప్రాయం వ్యక్తం చేశాడు. కేరళకు చెందిన ప్రముఖ దిన పత్రిక కౌముదికి ఇచ్చిన ఇంటర్వ్యూలో రిషిరాజ్ ఈ వ్యాఖ్యలు చేశారు. శ్రీదేవి ప్రమాదవశాత్తు జారి పడటం వల్ల మరణించి ఉండక పోవచ్చు. ఆమెది హత్య అయ్యి ఉండవచ్చు. ఆమె మరణంలో పలు అనుమానాలు ఉన్నాయంటూ ఆయన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు.
తాజాగా బోణీ కపూర్ ఆయన వ్యాఖ్యలపై ఒక మీడియ సంస్థతో మాట్లాడుతూ స్పందించాడు. అలాంటి చెత్త స్టోరీలపై నేను స్పందించను. స్టుపిడ్ స్టోరీలు ఎప్పుడు ఏవో ఒకటి వస్తూనే ఉంటాయి. వాటి గురించి ఆలోచించడం మానేశాను. శ్రీదేవిది హత్య అంటూ కొందరు కల్పించి కట్టు కథలు చెప్పేందుకు ప్రయత్నిస్తున్నారు. అవి వారి కల్పనలు మాత్రమే. అలాంటి వాటి గురించి పట్టించుకుని మాట్లాడేంత సమయం నాకు లేదంటూ ఆయన చెప్పుకొచ్చాడు.
శ్రీదేవిది సహజ మరణం కాదు అంటూ చాలా మంది గతంలో కూడా వ్యాఖ్యలు చేశారు. అయితే దుబాయి పోలీసులు సమగ్ర ఎంక్వౌరీ చేసిన తర్వాత ఆమె డెడ్ బాడీని ఇండియాకు పంపించారు. ఆమె హత్యలో ఎలాంటి అనుమానాలు అక్కర్లేదని ఇండియన్ పోలీసు వర్గాల వారు కూడా నిర్థారించారు. అయినా కూడా ఆమె మృతిపై కొందరు ఇంకా అనుమానాలు వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఇదంతా ఆమెపై ఉన్న అభిమానం అయ్యి కూడా ఉండవచ్చు అని బాలీవుడ్ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.