Begin typing your search above and press return to search.
ఆ ప్రశ్నలకు బయోపిక్ రూపంలో ఆన్సర్స్
By: Tupaki Desk | 9 Jan 2019 1:30 AM GMTఅతిలోక సుందరి మరణం యావత్తు దేశంలోని సినీ అభిమానులకు కన్నీరు మిగిల్చింది. ఆమె హఠత్మరణం అందరికి షాకింగ్ అయ్యింది. ఎక్కడో విదేశాల్లో శ్రీదేవి గుండెపోటుతో మరణించడం ఏంటీ, పైగా బాత్ రూంలో ఆమె డెడ్ బాడీ ఉండటం ఏంటీ అంటూ రకరకాలుగా ఆమె అభిమానుల్లో ప్రశ్నలు ఉన్నాయి. ఇక శ్రీదేవి డెడ్ బాడీని ఇండియాకు తీసుకు వచ్చేందుకు చాలా కష్టపడాల్సి వచ్చింది. సహజ మరణం అయితే అంతగా ఇబ్బంది ఎందుకు పడ్డారనేది కూడా కొందరి ప్రశ్న. ఈ ప్రశ్నలన్నింటికి బోణీ కపూర్ సమాధానం చెప్పేందుకు బయోపిక్ తో సిద్దం అవుతున్నాడు.
శ్రీదేవి మరణం సమయంలో బోణీకపూర్ ఆమె ఎలా చనిపోయిందో చెప్పాడు. కాని ఆమె మరణంపై ఉన్న అనుమానాలు మాత్రం ఆయన నివృత్తి చేయలేదు. ఆ ప్రశ్నలు అలాగే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే శ్రీదేవి బయోపిక్ కోసం జనాలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. బయోపిక్ తీస్తే రెండు రకాలుగా ప్రయోజనం చేకూరుతుందనే ఉద్దేశ్యంతో బోణీ కపూర్ ఈ పని చేయబోతున్నట్లుగా బాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. బయోపిక్ లో శ్రీదేవి హీరోయిన్ గా సాగించిన ప్రయాణంతో పాటు, ఆమె మరణంపై పూర్తి క్లారిటీ ఇవ్వబోతున్నాడట.
ఈ బయోపిక్ ను తానే స్వయంగా నిర్మించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాడు. తన టీంతో ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ చేయిస్తున్నాడు. తాను ఇచ్చిన ఇన్ పుట్స్ తో టీం కథను సిద్దం చేస్తున్నారు. ఒక ప్రముఖ దర్శకుడి చేతిలో ఈ బయోపిక్ ను పెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. శ్రీదేవి బయోపిక్ తీస్తే ఎవరు ఆమె పాత్రలో ఎవరు నటిస్తే బాగుంటుంది, ఆ స్థాయిలో ఎవరు ఉంటారనేది అందరిని తొలుస్తున్న ప్రశ్న. శ్రీదేవి బయోపిక్ లో శ్రీదేవి పాత్రను ఆమె కూతురు జాన్వీ కపూర్ చేస్తే బాగుంటుందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరి బోణీ కపూర్ ఆలోచన ఏంటో చూడాలి. ఆలస్యం చేయకుండా శ్రీదేవి బయోపిక్ ను త్వరలోనే తీసుకు వచ్చేలా బోణీ కపూర్ ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తుంది.