Begin typing your search above and press return to search.

వైరల్ వీడియో: బోనీ కపూర్ బ్యాడ్ టచ్!

By:  Tupaki Desk   |   2 April 2019 8:08 AM GMT
వైరల్ వీడియో: బోనీ కపూర్ బ్యాడ్ టచ్!
X
బాలీవుడ్లో ఉన్న సీనియర్ ప్రొడ్యూసర్లలో బోనీ కపూర్ ఒకరు. నిర్మాతగానే కాకుండా అతిలోక సుందరి శ్రీదేవి భర్తగా కూడా ఆయన చాలామందికి తెలుసు. తాజాగా బోనీ కపూర్ ఒక సంఘటనతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యారు.

రీసెంట్ గా ఆయన ఒక కార్యక్రమానికి హాజరయ్యారు. అదే కార్యక్రమానికి బాలీవుడ్ నటి మాజీ మిస్ యూనివర్స్ ఊర్వశి రౌతేలా కూడా హాజరయ్యింది.  ఫోటోగ్రాఫర్ల కోసం బోనీ కపూర్ తో కలిసి ఊర్వశి పోజిచ్చింది.  ఫోటోలకు పోజులివ్వడం పూర్తయిన తర్వాత పక్కకు వెళ్ళే క్రమంలో బోనీ కపూర్ ఊర్వశి బ్యాక్ ను తట్టాడు.  అదో క్యాజువల్ విషయం అన్నట్టుగా చిరునవ్వులు చిందిస్తూ పక్కకు వెళ్ళాడు. ఆ సమయంలో ఊర్వశి తన ఎక్స్ ప్రెషన్స్ మార్చకుండా నార్మల్ గా ఉండిపోయింది.

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో బోనీ అనుచిత ప్రవర్తనపై చాలామంది నెటిజనులు మండిపడుతున్నారు. కూతురు వయసున్న అమ్మాయితో ఇలాంటి అసభ్యకరమైన ప్రవర్తన ఏంటని తిట్టిపోస్తున్నారు.  పబ్లిక్ లో ఉన్నామన్న స్పృహ కూడా లేకుండా ప్రవరిస్తున్నారని.. వీరికి బుద్ధి చెప్పాలని కొందరు కామెంట్ చేస్తున్నారు. కొందరు ఇంకా ముందుకెళ్ళి ఊర్వశి అక్కడే బోనీ చెంప చెళ్ళుమనిపించి ఉండాల్సిందని అన్నారు.  ఈ కామెంట్ల సంగతేమో కానీ వీడియో మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. ఈ విషయంపైన ఇంకా బోనీ కపూర్ కానీ ఊర్వశి రౌతేలా కానీ స్పందించలేదు.

వీడియో కోసం క్లిక్ చేయండి