Begin typing your search above and press return to search.
శ్రీదేవి ఇంట మరో రెండు పాజిటివ్ కేసులు
By: Tupaki Desk | 22 May 2020 3:30 AM GMTదివంగత అతిలోక సుందరి శ్రీదేవి కుటుంబం ప్రస్తుతం భయాందోళనతో ఉన్నారు. ఇటీవలే కపూర్ ఇంట పని చేసే వ్యక్తికి పాజిటివ్ అని నిర్థారణ అయ్యింది. దాంతో కుటుంబ సభ్యులందరిని కూడా పరీక్షించిన అధికారులు నెగటివ్ గా తేల్చారు. అయితే మరో ఇద్దరు పని వారు మాత్రం పాజిటివ్ అని నిర్థారణ అయ్యింది. ఎలాంటి లక్షణాలు లేకుండా నిక్షేపంగా ఉన్న వారు నెగటివ్ అంటూ తేలడంతో కపూర్ ఫ్యామిలీ సన్నిహితులు అభిమానులు మరింత టెన్షన్ పడుతున్నారు.
ఈ విషయమై బోణీ కపూర్ క్లారిటీ ఇచ్చాడు. తామంతా కూడా బాగానే ఉన్నామని.. తమకు వైరస్ లక్షణాలు ఏమీ లేవని ఆయన పేర్కొన్నాడు. బోణీ కపూర్ ఫ్యామిలీ నుండి ప్రకటన రావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కపూర్ ఫ్యామిలీకి రెండు రోజుల తర్వాత మరో సారి కూడా టెస్టులు నిర్వహించే అవకాశం ఉందని తెలుస్తోంది.
మహారాష్ట్రలో పెద్ద ఎత్తున వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో బాలీవుడ్ సెలబ్రెటీలకు కూడా అది సోకుతుందనే ఆందోళన వ్యక్తం అవుతుంది. ప్రభుత్వం షూటింగ్స్ కు అనుమతించినా కూడా సెట్స్ పైకి వెళ్లేందుకు సినీ ప్రముఖులు భయ పడుతున్నారు. ప్రస్తుతానికి బాలీవుడ్ లో వైరస్ భయం లేదు కాని భవిష్యత్తు గురించి ఆందోళన వ్యక్తం అవుతోంది.