Begin typing your search above and press return to search.
పూర్వీకుల్లా కారు చౌకగా బతకడమెలా? మిల్కీ రచన!
By: Tupaki Desk | 25 Aug 2021 12:30 AM GMTమిల్కీ వైట్ బ్యూటీ తమన్నా ఆల్ రౌండర్ నైపుణ్యం ఇటీవల హాట్ టాపిక్ గా మారింది. తమన్నా సుమారు రెండు దశాబ్ధాల సుదీర్ఘ కెరీర్ తో టాలీవుడ్ లో ఇప్పటికీ రాణిస్తోంది. ఇటీవలే బుల్లితెర హోస్ట్ గానూ మారి మాస్టర్ చెఫ్ కార్యక్రమాలతో అలరిస్తున్నారు. ఇప్పటికే ఓటీటీ సిరీస్ లతోనూ తమన్నా బిజీగా ఉన్నారు. బుల్లితెర వెండితెర డిజిటల్ అనే భేధం లేకుండా తనవైపు వచ్చిన అన్ని అవకాశాల్ని తమన్నా సద్వినియోగం చేసుకుంటూ నటిగా క్షణం తీరిక లేనంత బిజీగా ఉన్నారు.
ప్రస్తుతం తన కెరీర్ లో అత్యుత్తమ దశను ఆస్వాధిస్తున్న తమన్నా ఇప్పటికే నితిన్ మాస్ట్రోలో విలన్ పాత్రతో మెస్మరైజ్ చేసేందుకు సిద్ధమవుతోంది. అలాగే తదుపరి రామ్ చరణ్ - శంకర్ చిత్రంలో విలన్ గా కనిపించనుంది. వెండితెరపై విజయవంతమైన నటిగా ఇటీవల తమన్నా ప్రయోగాలు ఆశ్చర్యపరుస్తున్నాయి. ఇకపై వీటన్నిటికీ భిన్నంగా రచయితగా ప్రచురణ పరిశ్రమలోకి కూడా ప్రవేశించి బిగ్ షాక్ ఇవ్వబోతోంది.
`బ్యాక్ టు ది రూట్స్` అనే కొత్త పుస్తకానికి తమన్నా సహ రచయితగా ఉన్నారు. జీవనశైలి కోచ్ ల్యూక్ కౌటిన్హోతో కలిసి తమన్నా ఈ పుస్తకాన్ని రాశారు. ఈ పుస్తకం భారతదేశపు ప్రాచీన జ్ఞానాన్ని పాఠకులకు అందించనుంది. ప్రజలు వారి జీవనశైలిలో పెట్టుబడి పెట్టడం ఎంత చవకగా ఉంటుందో ఈ బుక్ తెలియజేస్తుంది. వ్యాధులను నివారించడం.. దీర్ఘాయువును మెరుగుపరచడం.. జీవిత నాణ్యతను మెరుగుపరచడంలో ప్రజలకు సహాయపడే పురాతన భారతీయ పద్ధతులను ఈ పుస్తకం చర్చిస్తుంది. బ్యాక్ టు ది రూట్స్ చాలా ప్రత్యేకమైనది, ఎందుకంటే ఇది నా మొదటి పుస్తకం. మన ప్రాచీన పద్ధతుల ప్రాముఖ్యతను ప్రజలు అర్థం చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ప్రస్తుత కాలంలో సాంస్కృతిక జ్ఞానం అన్నింటికన్నా ఎక్కువ ప్రాముఖ్యతను కలిగి ఉన్నా మనిషి దేనినీ తప్పించుకోలేకపోతున్నాడు. దానికి విరుగుడు ఇందులో ఉంది అని అన్నారు.
ల్యూక్ కౌటిన్హో గతంలో ``ది గ్రేట్ ఇండియన్ డైట్ విత్ శిల్పా శెట్టి``..``ది మ్యాజిక్ వెయిట్-లాస్ పిల్ విత్ అనుష్క శెట్టి`` వంటి పుస్తకాలను రచించారు. పెంగ్విన్ రాండమ్ హౌస్ ఇండియా ఈ పుస్తకాన్ని ప్రచురించింది. ఇది ఆగస్టు 30 నుండి మార్కెట్లో అందుబాటులో ఉంటుంది. ఈ పుస్తకం ద్వారా ఒత్తిడులు లేని పాత పద్ధతిలో జీవించడం ఎలానో అలవడుతుందని తమన్నా కాన్ఫిడెంట్ గా చెబుతోంది. ప్రతిదానికీ ఆస్పత్రులకు పరుగులు పెట్టే నేటితరానికి ఇలాంటి విజ్ఞానదాయకమైన పుస్తకం అవసరం ఎంతైనా ఉందనడంలో సందేహమేం లేదు.
క్రైసిస్ లో పెండింగ్ లిస్ట్ పెద్దదే..!
తమన్నా నటించిన పలు చిత్రాలు రిలీజ్ లకు రావాల్సి ఉంది. `సిటీమార్`.. `గుర్తుందా శీతాకాలం` రిలీజ్ కి రావాల్సి ఉంది. ఎఫ్ 2 సీక్వెల్ ఎఫ్ 3తోనూ తమన్నా బిజీగా ఉంది. అలాగే హిందీలో మరో సినిమా చేస్తుంది. నవాజుద్దిన్ సిద్ధిఖీ సరసన `బోల్ చుడేయాన్` లో నటిస్తోంది. కొంత గ్యాప్ తర్వాత బాలీవుడ్ లో ఈ సినిమాతో హిట్టు కొట్టాలన్న పంతంతో ఉంది. అలాగే తమన్నా నటించిన `దటీజ్ మహాలక్ష్మీ` అన్ని పనులు పూర్తైనా ఇంకా రిలీజ్ కు నోచుకోలేదు. ఎప్పుడు రిలీజ్ అవుతుందో క్లారిటీ కూడా లేదు. త్వరలోనే ఈ పెండింగ్ ప్రాజెక్టుల రిలీజ్ లపైనా క్లారిటీ ఇవ్వనున్నారని తెలుస్తోంది.