Begin typing your search above and press return to search.

వీడియో : ప్రకృతి తిరగబడితే 'భూమిక'

By:  Tupaki Desk   |   17 Aug 2021 5:39 AM GMT
వీడియో : ప్రకృతి తిరగబడితే భూమిక
X
ప్రముఖ నటి ఐశ్వర్య రాజేష్‌ కీలక పాత్రలో ప్రముఖ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు సమర్పణలో రతీంద్రన్‌ ఆర్‌ ప్రసాద్‌ దర్శకత్వంలో రూపొందిన 'భూమిక' సినిమా నెట్ ఫ్లిక్స్ ద్వారా స్ట్రీమింగ్ కు సిద్దం అయ్యింది. తమిళంలో రూపొందిన ఈ సినిమాను తెలుగు లో కూడా డబ్‌ చేసి స్ట్రీమింగ్‌ కు సిద్దం చేస్తున్నారు. తమిళంతో పాటు తెలుగులో కూడా ఒకేసారి ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయబోతున్నట్లుగా నెట్‌ ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటన చేసింది. సినిమాను ఈనెల 23న విడుదల చేయబోతున్నారు. ఈ సందర్బంగా సినిమా టీజర్‌ ను విడుదల చేశారు. సస్పెన్స్ థ్రిల్లర్‌ మూవీగా భూమిక ఉంటుందని టీజర్ చూస్తుంటే అనిపిస్తుంది. దర్శకుడు కార్తీక్‌ సుబ్బరాజు సమర్పణ అవ్వడంతో ఖచ్చితంగా సినిమాలో మ్యాటర్ ఉంటుందని తమిళ మీడియా వర్గాల వారు చెబుతున్నారు.

భూమి ఎప్పుడు మనతో ఏదో ఒక విషయంను చెబుతూనే ఉంటుంది. అది ఏమంటుందో తెలుసా.. నన్ను కాపాడుకోవడం నాకు తెలుసు.. వీలైతే నా నుండి నిన్ను నువ్వు కాపాడుకో అంటుంది అంటూ టీజర్‌ లో వచ్చిన డైలాగ్ చాలా డెప్త్‌ గా అనిపిస్తుంది. సినిమాలో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ చాలా ఉంటాయని టీజర్ చూసిన ప్రతి ఒక్కరు అనుకుంటారు. నటిగా ఇప్పటికే మంచి పేరు ను దక్కించుకున్న ఐశ్వర్య రాజేష్ ఈ సినిమా తో మరో సారి తనలోని నట విశ్వరూపంను చూపించడం ఖాయం అన్నట్లుగా నెటిజన్స్‌ కామెంట్స్ చేస్తున్నారు.

టీజర్‌ సినిమా స్థాయిని పెంచడంతో పాటు ప్రతి ఒక్కరిలో ఇంట్రెస్ట్‌ ను కలిగించేలా ఉంది. ఈమద్య కాంలలో ఓటీటీ రిలీజ్‌ లు ఎక్కువ అవుతున్నాయి. కనుక ఈ సినిమా కూడా థియేటర్లు లేని కారణంగా ఓటీటీ రిలీజ్ కు సిద్దం అయ్యింది. నెట్‌ ఫ్లిక్స్ లో ఈ మద్య కాలంలో వరుసగా మంచి కాన్సెప్ట్‌ సినిమాలు వస్తున్నాయి. అదే దారిలో ఈ సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అయ్యింది. దర్శకుడు రతీంద్రన్‌ ఈ సినిమాను తెరకెక్కించిన తీరు ప్రతి ఒక్కరికి నచ్చుతుందని.. తమిళ ఆడియన్స్‌ తో పాటు తెలుగు ఆడియన్స్ కూడా ఈ సినిమాను ఎంజాయ్ చేయడంతో పాటు థ్రిల్ అవుతారు అంటూ నమ్మకంగా చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు.