Begin typing your search above and press return to search.

ఫ్యాన్ పై అభిషేక్ జోక్ అదుర్స్

By:  Tupaki Desk   |   16 April 2016 5:30 PM GMT
ఫ్యాన్ పై అభిషేక్ జోక్ అదుర్స్
X
బాలీవుడ్ లో ఈ ఏడాది బిగ్గెస్ట్ మూవీగా షారూక్ ఖాన్ మూవీ ఫ్యాన్ థియేటర్లలోకి వచ్చేసింది. తొలిరోజు వసూళ్లలో 2016 రికార్డులన్నిటినీ ఫ్యాన్ బ్రేక్ చేసేసింది. అయితే.. ఫ్యాన్ పై అభిషేక్ బచ్చన్ వేసిన ఓ జోక్ ఇప్పుడు అందరినీ తెగ నవ్విస్తోంది.

'డియర్ షారూక్ ఖాన్.. నాకు ఈ ఫ్యాన్ ని చూసీచూసీ విసుగొచ్చేసింది. నువ్వు నటించిన ఫ్యాన్ చూడాలని ఆశగా ఉంది. గుడ్ లక్' అంటూ ట్వీట్ చేసిన అభిషేక్ బచ్చన్.. తన ఇంట్లోని సీలింగ్ ఫ్యాన్ ని ఫోటో తీసి పోస్ట్ చేశాడు. దీనికి షారూక్ కూడా వెంటనే స్పందించాడు. 'నువ్వు చూడ్డం కోసం సినిమాని ఇంటికి పంపించనా' అని వెంటనే తిరిగి క్వశ్చన్ చేశాడు షారూక్. ఈ మాటలు అందరినీ నవ్వుల్లో ముంచెత్తాయి. నిజానికి సీలింగ్ ఫ్యాన్ చూస్తూ ఉండడంలో విసుగు అంటూ.. స్మాల్ బీ తన పరిస్థితిని ఇన్ డైరెక్టుగా చెప్పాడు. ఈ హీరో గత 20 రోజులుగా బయటకు రావడం లేదు.

వెన్ను నొప్పికారణంగా రెస్ట్ తీసుకోవాలని డాక్టర్లు సూచించడంతో.. పూర్తిగా బెడ్ రెస్ట్ తీసుకుంటున్నాడు. తన కూతురు ఆరాధ్య స్కూల్ ఫంక్షన్ తప్ప.. మరెక్కడా కనిపించలేదు అభిషేక్. బ్రిటన్ ప్రిన్స్ ఈవెంట్ కి కూడా అభిషేక్ హాజరు కావాల్సి ఉన్నా.. వెన్ను నొప్పి కారణంగానే రాలేకపోయాడు. చివరగా అయితే.. ఇండియా-పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ ని చూసేందుకు అభిషేక్ బయటకు వచ్చాడంతే. అప్పటి నుంచి బెడ్ రెస్ట్ లోనే ఉండడంతో.. ఇలా షారూక్ ఫ్యాన్ పై ప్రాక్టికల్ జోక్ వేశాడు అభిషేక్ బచ్చన్.