Begin typing your search above and press return to search.

పెద్దగా రీసెర్చ్ చేయ‌కుండానే బాస్ లుక్!

By:  Tupaki Desk   |   14 Jan 2023 3:30 PM GMT
పెద్దగా రీసెర్చ్ చేయ‌కుండానే బాస్ లుక్!
X
మెగాస్టార్ చిరంజీవి క‌థానాయ‌కుడిగా బాబి తెర‌కెక్కించిన వాల్తేరు వీర‌య్య సంక్రాంతి కానుక‌గా విడుద‌లైన సంగ‌తి తెలిసిందే. అద్భుత‌మైన మాస్ ఎలివేష‌న్స్ తో మెగా బాస్ ఈజ్ బ్యాక్ అన్న తీరుగా న‌టించార‌ని విమ‌ర్శ‌కులు ప్ర‌శంస‌లు కురిపించారు. ముఖ్యంగా దర్శకుడు బాబీ మెగాస్టార్ చిరంజీవిని పాతకాలపు అవతార్ లో డిజైన్ చేసిన తీరు ఆక‌ట్టుకుంది. మ‌రోసారి గ్యాంగ్ లీడ‌ర్ - ముఠామేస్త్రి లుక్ ని అత‌డు తిరిగి తేవ‌డంలో స‌ఫ‌ల‌మ‌య్యాడ‌ని ప్ర‌శంస‌లు ద‌క్కాయి. ఇక ఈ చిత్రంలో బాస్ లుక్ కోసం సుస్మిత కొణిదెల కాస్ట్యూమ్స్ డిజైన్ చేసారు. చిరు స్టైలింగ్ ఎలా ఉండాలో నేరేట్ చేసిన‌ది సుస్మిత‌నే.

అయితే బాస్ ని తిరిగి ఆరోజుల్లోకి తీసుకెళ్ల‌డం అంటే దానికోసం చాలా శ్ర‌మించి ఉంటార‌ని భావిస్తే పొర‌పాటే. ఈ సినిమా కోసం పెద్దగా రీసెర్చ్ చేయాల్సిన అవసరం లేదని సుస్మిత చెప్పారు. బాబి కథ విన్న తర్వాత కొన్ని ఆలోచనలు వచ్చాయి. గ్యాంగ్ లీడర్ లో లా బాస్ లుక్ కావాల‌ని దర్శ‌కుడు కోరారు.

నాన్నగారి సినిమాలన్నీ చాలాసార్లు చూశాం కాబట్టి పెద్దగా రీసెర్చ్ చేయాల్సిన పనిలేదని కూడా సుస్మిత కొణిదెల‌ అన్నారు. పాతకాలపు గెటప్ లో మెగా బాస్ ని తెరపై చూడటం తనకు అద్భుతంగా అనిపించిందని సుస్మిత అన్నారు. ఇది నా నాన్నాకు అత్యంత సౌకర్యవంతమైన జోన్. అదొక పెద్ద పండుగలా అనిపించింది అని అన్నారు.

సుస్మిత త‌న తండ్రి చిరంజీవి కోసం కాస్ట్యూమ‌ర్ గా ప‌ని చేస్తూనే మ‌రోవైపు సొంత బ్యాన‌ర్ ని విస్త‌రించే యోచ‌న‌లో ఉన్నారు. మునుముందు త‌న బ్యాన‌ర్ లో భారీ సినిమాలు చేయాల‌ని ప్ర‌య‌త్నిస్తున్నారు. ఇప్ప‌టికే వెబ్ సిరీస్ ల నిర్మాణంలో సుస్మిత అనుభ‌వం సంపాదించిన సంగ‌తి తెలిసిందే.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.