Begin typing your search above and press return to search.
దసరా సినిమాలు.. ఆశ్చర్యకర పరిణామం
By: Tupaki Desk | 20 Oct 2016 5:30 PM GMTఈ ఏడాది సంక్రాంతికి ఒకేసారి నాలుగు సినిమాలు పోటీ పడ్డప్పుడు అందరూ కలవర పడ్డారు. ఈ పోటీ వల్ల అన్ని సినిమాలూ దెబ్బ తింటాయని.. కలెక్షన్లపై తీవ్ర ప్రభావం పడుతుందని.. నెగెటివ్ టాక్ తెచ్చుకున్న సినిమా అన్యాయమైపోతుందని ఆందోళన చెందారు. ఐతే కలెక్షన్లపై ప్రభావం పడలేదు అని కాదు కానీ... పోటీలో ఉన్న నాలుగు సినిమాలు కాస్త హెచ్చుతగ్గులతో మంచి ఫలితాలే రాబట్టాయి. ‘డిక్టేటర్’ మినహాయిస్తే మూడూ మంచి కలెక్షన్లే తెచ్చుకున్నాయి. అది చూసే.. దసరా పండక్కి కూడా ఒకేసారి ఐదు సినిమాల్ని పోటీలోకి నిలిపేశారు. ఎవరికి వాళ్లు కాన్ఫిడెంటుగా తమ సినిమాను రేసులో నిలబెట్టేశారు. సంక్రాంతి మ్యాజికే రిపీటవుతుందని.. అలా కాకున్నా కనీసం రెండు మూడు సినిమాలైనా మంచి ఫలితాన్నే అందుకుంటాయని భావించారు.
కానీ అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి.. ఒక్క ‘ప్రేమమ్’ సినిమా మినహాయిస్తే ఏదీ బాక్సాఫీస్ దగ్గర ప్రభావం చూపలేకపోయింది. మామూలుగా పండగ సెలవుల్లో కొంచెం డివైడ్ టాక్ తెచ్చుకున్న సినిమా కూడా మంచి వసూళ్లే రాబట్టాలి. కానీ మంచి సినిమాగా పేరు తెచ్చుకున్న ప్రకాష్ రాజ్ సినిమా ‘మనవూరి రామాయణం’.. ఓ మోస్తరు టాక్ తెచ్చుకున్న అభినేత్రి కూడా నిలవలేకపోయాయి. డివైడ్ టాక్ వచ్చినా.. మాస్ ప్రేక్షకుల్ని అలరిస్తుందని భావించిన ‘ఈడు గోల్డ్ ఎహే’ కూడా ఘోరంగా దెబ్బ తింది. కన్నడ సినిమా ‘జాగ్వార్’ సంగతి పక్కనబెట్టేద్దాం. మిగతా వాటిలో ‘ప్రేమమ్’ మినహా అన్నీ కూడా దెబ్బ తిన్నవే. సంక్రాంతికి వచ్చిన నాలుగు సినిమాలు కలిపి రూ.140 కోట్ల దాకా షేర్ కలెక్ట్ చేయడం విశేషం. కానీ ఇప్పుడు దసరా సినిమాల్లో ప్రేమమ్ ఒక్కటి రూ.25 కోట్ల షేర్ రాబట్టేలా ఉంది. మిగతావన్నీ కలిపినా రూ.25 కోట్ల షేర్ రావట్లేదు. అంటే మొత్తంగా లెక్క రూ.50 కోట్లు దాటడం కూడా కష్టమే అన్నట్లుంది. రూ.140 కోట్లు.. రూ.50 కోట్లు.. ఎంత తేడానో చూశారా?
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/