Begin typing your search above and press return to search.

ఏకంగా 8 రిలీజ్ లు.. ఒక్క టైటిలైనా తెలుసా?

By:  Tupaki Desk   |   12 March 2020 12:30 AM GMT
ఏకంగా 8 రిలీజ్ లు.. ఒక్క టైటిలైనా తెలుసా?
X
వారం వారం సినిమాలు వ‌స్తుంటాయి. వెళుతుంటాయి. అందు లో స‌క్సెస్ సాధించి బ‌య్య‌ర్లు.. పంపిణీదారుల‌ను సంతృప్తి ప‌రిచేవి అరుదుగానే ఉంటాయి. సంక్రాంతి బ‌రిలో అల వైకుంఠ‌పుర‌ములో 200శాతం సంతృప్తినిచ్చిన చిత్రం. ఇటీవ‌ల నితిన్ భీష్మ చక్క‌ని విజ‌యం సాధించింది. గ‌త శుక్ర‌వారం వ‌చ్చిన వాటిలో ప‌లాస వ‌ర‌కూ సేఫ్ అయ్యింద‌న్నారు.

ఈ వారం 8 సినిమాల రిలీజ్ లు కన్ఫమ్ అయ్యాయ‌న్న టాక్ ఉంది. అయితే వీటిలో ఏ సినిమా టైటిల్ ఇంత‌వ‌ర‌కూ జ‌నాల మైండ్ లో రిజిస్ట‌ర్ అయ్యిందే లేదు. ఓవైపు క‌రోనా భ‌యం.. మ‌రోవైపు ప‌బ్లిక్ ప‌రీక్ష‌ల భ‌యం ఉండ‌గానే ఈ వారం ఏకంగా ఎనిమిది వ‌చ్చేస్తున్నాయంటే అర్థం చేసుకోవాలి.

ఇప్ప‌టికీ భీష్మ .. దీంతో పాటే ఓ చిన్న సినిమా థియేట‌ర్ల‌ లో ఆడుతున్నాయి. కలెక్షన్స్ తో రన్నింగ్ లో ఉన్నాయన్న టాక్ ఉంది. అంటే 11 సినిమాలకి థియేటర్స్ కావాలి.. మరి ఇన్నిటికి ఎలా థియేటర్స్ దొరుకుతాయి? చిన్న సినిమాలు నలిగి పోతున్నాయి... అస‌లేం జ‌రుగుతుం దో చూడాలి అంటూ ట్రేడ్ లో టాక్ నడుస్తోంది.

ఆరుగాలం ఎంతో శ్ర‌మించి తీస్తారు. ఒక్కో సినిమా కోసం 6 నెలలు క‌ష్ట‌ప‌డి తీస్తారు.. రేలీజ్ కి మాత్రం 1 నెల ఆగలేరు... వేయటం తీయటం ఇదేనా? అంటూ ఓ సెక్ష‌న్ నుంచి విమ‌ర్శ‌లు ఎదుర‌వుతున్నాయి. ఇక ఈ శుక్ర‌వారం రానున్న వాటిలో 6 సినిమాలు వోన్ రేలీజ్ లేన‌ని తెలుస్తోంది. అంటే వాటిని కొనే నాథుడే లేడ‌ని దీని మీనింగ్. వీటిలో ఏవేవి ఉన్నాయి అంటే? మార్చి 13న ఆరు సినిమాలొస్తున్నాయి. ప్రేమ పిపాసి - బగ్గీడి గోపాల్-302 - శివన్ 13 - పిజ్జా 3 - యురేక - అర్జున్ ఇవేగాక వేరే సినిమాలు క్యూలో ఉన్నాయిట‌. అస‌లు ఈ సినిమాల టైటిల్స్ అయినా ఆడియెన్ కి తెలుసా? అంటూ పెద‌వి విరిచేస్తున్నారు. ప్ర‌చారం అంత వీక్ గా ఉంటే క‌ష్ట‌మేన‌న్న మాటా వినిపిస్తోంది. ఇక రిలీజ్ కి డేట్ దొర‌క‌డ‌మే ఆల‌స్యం అన్న‌ట్టుగా స్టాక్ సినిమాల‌న్నీ రిలీజ‌వుతున్న‌ట్టే క‌నిపిస్తోంది.