Begin typing your search above and press return to search.
అన్ సీజన్లో బాక్స్ ఆఫీస్ కొట్లాట!
By: Tupaki Desk | 5 Nov 2019 8:11 AM GMTసంక్రాంతి.. వేసవి.. దసరా లాంటి సీజన్లలో బాక్స్ ఆఫీస్ వద్ద తీవ్రమైన పోటీ నెలకొంటుంది. అది సహజమే.. కానీ ఈమధ్య డెడ్ సీజన్.. అన్ సీజన్ అని ట్రేడ్ వర్గాలు భావించే నవంబర్ లో కూడా బాక్స్ ఆఫీస్ వద్ద తీవ్రమైన పోటీ నెలకొనడం హాట్ టాపిక్ గా మారింది. ఈ నవంబర్ 15 న మొత్తం ఐదు సినిమాలు రిలీజ్ కానున్నాయి.
1. రాగల 24 గంటల్లో: శ్రీనివాసరెడ్డి దర్శకత్వంలో ఈషా రెబ్బా ప్రధాన పాత్రలో నటించిన థ్రిల్లర్ ఇది. ఈ సినిమా విజయం అటు శ్రీనివాసరెడ్డి.. ఇటు ఈషాకు కీలకమే.
2. తెనాలి రామకృష్ణ BA BL: జి. నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో సందీప్ కిషన్ హీరో. హన్సిక హీరోయిన్ గా నటిస్తోంది. వరలక్ష్మి శరత్ కుమార్ మరో కీలక పాత్రలో నటిస్తోంది. రిలీజ్ అవుతున్న ఐదు సినిమాల్లో ఇదే కొద్దో గొప్పో క్రేజ్ ఉన్న సినిమా ఇదే.
3. యాక్షన్: కోలీవుడ్ హీరో విశాల్ నటించిన తమిళ సినిమా 'యాక్షన్' కు డబ్బింగ్ వెర్షనే ఈ తెలుగు 'యాక్షన్'. విశాల్ సరసన తమన్నా హీరోయిన్ గా నటించింది. సుందర్ C. ఈ చిత్రానికి దర్శకుడు. యాక్షన్ సినిమా ప్రియలకు నచ్చే తరహాలోనే ఉందని ప్రోమోస్ చెప్తున్నాయి.
4. అనుకోని అతిథి: సాయి పల్లవి.. ఫహద్ ఫాజిల్ నటించిన మలయాళం చిత్రం 'అథిరన్' కు డబ్బింగ్ వెర్షన్ ఈ 'అనుకోని అతిథి'. సైకలాజికల్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులను ఎంతమాత్రం మెప్పిస్తుందో వేచి చూడాలి.
5. విజయ్ సేతుపతి: టైటిల్ లో నే హీరో ఎవరో తెలిసిపోయింది కదా..? అవును. విజయ్ సేతుపతి హీరో. ఆయన నటించిన లేటెస్ట్ తమిళ చిత్రం 'సంగతమిళన్' కు తెలుగు వెర్షనే ఈ 'విజయ్ సేతుపతి'. ఈ సినిమాకు విజయ్ చందర్ దర్శకుడు.
ప్రస్తుతానికి నవంబర్ 15 లిస్టులో ఈ ఐదు సినిమాలు ఉన్నాయి. లాస్ట్ మినిట్ మార్పుచేర్పులు ఉంటే తప్ప ఈ ఐదు ఫిక్స్. అన్ సీజన్ లో ఇలా ఇదు సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర పోటీపడడం ఆశ్చర్యకరమే. అసలే డిమాండ్ లేని సీజన్.. ఈ సీజన్ లో ఇంత పోటీలో రిలీజ్ చేయడం ఎందుకో మేకర్స్ కే తెలియాలి. అలా అని నెక్స్ట్ వీక్ కు వెళ్తే అక్కడా పోటీ ఉంది. మరి ఈ నవంబర్ 15 బాక్స్ ఆఫీస్ సమరంలో ఏ సినిమా విజేతగా నిలుస్తుందో వేచి చూడాలి.