Begin typing your search above and press return to search.
ఓవర్సీస్:చరణ్ కెరీర్ లో సెకండ్ లీస్ట్ కలెక్షన్స్
By: Tupaki Desk | 22 Jan 2019 9:58 AM GMTబోయపాటి శ్రీను - రామ్ చరణ్ కాంబినేషన్లో తెరకెక్కిన 'వినయ విధేయ రామ' భారీ అంచనాలమధ్య జనవరి 11న విడుదలయింది. సినిమాకు మొదటి షో నుంచే మిక్స్డ్ టాక్ రావడంతో సినిమా విజయంపై అనుమానాలు నెలకొన్నాయి. నెగెటివ్ టాక్ ను తట్టుకొని.. సంక్రాంతి హాలిడేస్ ను ఉపయోగించుకుంటూ లోకల్ మార్కెట్ లో నష్టాలను తగ్గించుకోగలిగింది కానీ ఓవర్సీస్ లో మాత్రం ఈ సినిమాకు భారీ నష్టాలు తప్పలేదు.
'వినయ విధేయ రామ' ఓవర్సీస్ రైట్స్ రూ. 6.20 కోట్లకు అమ్మారు. ఈ సినిమా ఇప్పటివరకూ $253,196 గ్రాస్ కలెక్షన్స్ ($116,364 డిస్ట్రిబ్యూటర్ షేర్). ఇందులో వీపీఎఫ్.. పబ్లిసిటీ ఖర్చులన్నీ కనుక తీసేస్తే డిస్ట్రిబ్యూటర్ కు దాదాపుగా ఏమీ మిగలదు. ఇది అమెరికా వసూళ్ళ లెక్క. అమెరికా కాకుండా ఓవర్సీస్ లో ఇతర దేశాలనుండి వచ్చిన షేర్ రూ.1.20 కోట్లు. అంటే రూ. 6.20 కోట్లకు గానూ తిరిగి వచ్చింది రూ.1.20 కోట్లు కాబట్టి లాస్ రూ. 5 కోట్లు. ఓవరాల్ గా చూస్తే 80% కంటే ఎక్కువగా నష్టపోయినట్టే.
'వినయ విధేయ రామ' మరో విషయంలో కూడా చరణ్ ఫ్యాన్స్ మర్చిపోదగిన రికార్డు సృష్టించింది. రామ్ చరణ్ కెరీర్ లో అమెరికాలో అతి తక్కువ కలెక్షన్స్ సాధించిన చిత్రాలలో 'తూఫాన్' ($68,105 )తర్వాత రెండో స్థానంలో నిలిచింది.