Begin typing your search above and press return to search.

వెలవెలబోతున్న బాక్స్ ఆఫీస్.. డిసెంబర్ లో అయినా..?

By:  Tupaki Desk   |   9 Dec 2019 6:46 AM GMT
వెలవెలబోతున్న బాక్స్ ఆఫీస్.. డిసెంబర్ లో అయినా..?
X
ఒక్కో వ్యాపారానికి ఒక్కో అన్ సీజన్ ఉంటుంది. సినిమాల విషయానికి వస్తే అటు మార్చ్ ఇటు నవంబర్ ను డల్ సీజన్ అని ట్రేడ్ వర్గాల వారు చెప్తూ ఉంటారు. ఈ నెలలో క్లియరెన్స్ సేల్ తరహాలో సినిమాలు రిలీజ్ అవుతాయి కానీ క్రేజీ సినిమాల నిర్మాతలు ఈ నెలల వైపు చూడరు. ఈ సారి కూడా నవంబర్ బాక్స్ ఆఫీస్ ను గడగడలాడించింది. ఒక్క హిట్టూ లేక బాక్స్ ఆఫీసుకు కళతప్పింది.

ఒక్క నవంబరేనా..? 'ఇస్మార్ట్ శంకర్' తర్వాత ఇంతవరకూ ఆ రేంజ్ లో మంచి కలెక్షన్స్ సాధించిన హిట్ లేదు. ఒకటిఅరా సినిమాలు హిట్ అయినా అవి అత్తెసరు లాభాలు తీసుకొచ్చినవే కానీ 'ఇస్మార్ట్ శంకర్' రేంజ్ బ్లాక్ బస్టర్లు కాదు. ఇక నవంబర్లో పరిస్థితి మరింత దిగజారింది. కనీసం థియేటర్ల మెయింటెనెన్స్ ఖర్చులు కూడా రావడం లేదంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. దీంతో ఇప్పుడు అందరి దృష్టి డిసెంబర్ లో రిలీజ్ కానున్న సినిమాలపైనే ఉంది.

ముఖ్యంగా డిసెంబర్ సీజన్ ను వెంకటేష్ - నాగచైతన్య 'వెంకీమామ' తో ప్రారంభించబోతున్నారు. ఇద్దరూ హీరోలకు కుటుంబప్రేక్షకుల్లో మంచి ఆదరణ ఉంది కాబట్టి మంచి టాక్ వస్తే ఈ సినిమా బాక్స్ ఆఫీసుకు పునర్వైభవం తీసుకురావడం ఖాయమే. ఈ సినిమానే కాకుండా డిసెంబర్ 20 వ తేదీన విడుదల కానున్న తేజు - మారుతి సినిమా 'ప్రతిరోజూ పండగే'.. నందమూరి బాలకృష్ణ 'రూలర్' పై కూడా మంచి అంచనాలే ఉన్నయి. ఇవే కాకుండా మరి కొన్ని సినిమాలు డిసెంబర్ లో ప్రేక్షకులను పలకరించబోతున్నాయి. మరి డిసెంబర్ సినిమాలు ఈ స్లంప్ నుండి బాక్స్ ఆఫీసును బైటకు తీసుకొస్తాయా అనేది వేచి చూడాలి