Begin typing your search above and press return to search.
టికెట్ కౌంటర్: టార్జాన్ దెబ్బ అదిరింది
By: Tupaki Desk | 4 July 2016 8:23 AM GMTఈ వారం టాలీవుడ్ లో చెప్పుకోదగ్గ సినిమాలు రాలేదు. వచ్చినవేవీ అంచనాలకు తగ్గట్లుగా ఆడియన్స్ ని ఆకట్టుకోలేదు. దీంతో ఈ వీకెండ్ బాక్సాఫీస్ దగ్గర తెలుగు సినిమాల కంటే.. డబ్బింగ్ సినిమాల ఆధిపత్యమే కొనసాగింది.
1. లెజెండ్ ఆఫ్ టార్జాన్: ఈ వీకెండ్ లో హాలీవుడ్ మూవీ లెజెండ్ ఆఫ్ టార్జాన్ టాప్ ప్లేస్ లో నిలవడం విశేషం. కంటెంట్ విషయంలో అంచనాలకు అనుగుణంగా లేకపోయినా.. ఈ యాక్షన్ మూవీకి ఆడియన్స్ బాగానే కనెక్ట్ అయ్యారు. తెలుగు రాష్ట్రాల్లో ఓపెనింగ్స్ అదిరిపోయాయి. సింగిల్ స్క్రీన్లలో తెలుగు డబ్బింగ్ వెర్షన్.. మల్టీప్లెక్సుల్లో ఇంగ్లీష్ వెర్షన్ ఆధిపత్యం చూపించాయి.
2. జెంటిల్మన్: తెలుగు సినిమానే చూడాలని అనుకునే ప్రేక్షకులకు నాని జెంటిల్మన్ బెస్ట్ ఆప్షన్ గా కనిపిస్తోంది. మరో టాలీవుడ్ మూవీ ఏదీ హిట్ టాక్ తెచ్చుకోకపోవడంతో.. థియేటర్లకు వచ్చే జనాలకు జెంటిల్మన్ ఒకటే ఛాయిస్ గా కనిపిస్తోంది. దీంతో ఇప్పటికే లాభాల్లో ఉన్న డిస్ట్రిబ్యూటర్లకు.. మరిన్న ప్రాఫిట్స్ కనిపిస్తున్నాయి. ఈ మూవీ 20 కోట్ల మార్క్ ను అందుకోవడం ఖాయం అంటున్నారు.
3. రోజులు మారాయి: మారుతి స్టోరీ స్క్రీన్ ప్లే.. దిల్ రాజు అసోసియేషన్ అనే ట్యాగులు రోజులు మారాయికి బాగానే కలిసొచ్చాయి. మొదటి రోజున వసూళ్లు కనిపించినా.. టాక్ బాగోకపోవడంతో ఆ మేరకు శని, ఆదివారాల్లో కలెక్షన్స్ రాబట్టలేకపోయింది. అయితే యూత్ మాత్రం థియేటర్లకు అంతో ఇంతో వస్తున్నారు.
4. బిచ్చగాడు: 50 రోజుల తర్వాత కూడా బిచ్చగాడుకి చెప్పుకోదగ్గ వసూళ్లు వస్తుండడం విశేషం. ఇప్పటికే తమ సినిమాకి 20 కోట్ల గ్రాస్ వచ్చిందని నిర్మాతలు అనౌన్స్ చేశారు. తమిళనాడులో కంటే ఇక్కడే పెద్ద హిట్ గా నిలవడం గమనించాల్సిన విషయం.
5. దొర: కట్టప్పగా ఆకట్టుకున్న సత్యరాజ్ నటించిన దొర.. ఈ వారంలో ఆసక్తి కలిగించిన సినిమా. అయితే పోస్టర్లలో ఉన్న కంటెంట్ సినిమాలో లేకపోవడంతో.. జనాలు నిరుత్సాహపడ్డారు. తొలి ఆట నుంచే బ్యాడ్ టాక్ కారణంగా అంచనాలను అందుకోలేకపోయాడు దొర.
అయితే.. ఈ వారం టాప్ 5 వసూళ్లు సాధించిన సినిమాల్లో 3 డబ్బింగ్ చిత్రాలే.