Begin typing your search above and press return to search.

బాక్స‌ర్ ఫ్యాన్ మేడ్ పోస్ట‌ర్ అద‌ర‌హో!

By:  Tupaki Desk   |   19 Jan 2020 8:24 AM GMT
బాక్స‌ర్ ఫ్యాన్ మేడ్ పోస్ట‌ర్ అద‌ర‌హో!
X
వ‌రుస ప్ర‌యోగాలతో టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యాడు మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్. 2019లో గద్దలకొండ గణేష్ గా అభిమానుల్ని అల‌రించాడు. గ‌ద్ద‌ల‌కొండ రెగ్యుల‌ర్ క‌మ‌ర్షియ‌ల్ ట్రీట్ అయినా వ‌రుణ్ తేజ్ ర‌ఫ్ అండ్ ఠ‌ఫ్ లుక్.. మాసీ పెర్ఫామెన్స్ కు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. ప్ర‌స్తుతం అందుకు పూర్తి భిన్న‌మైన క‌థాంశాన్ని ఎంచుకుని వ‌రుణ్ మ‌రో ప్ర‌యోగానికి సిద్ధ‌మ‌య్యాడు. ఈసారి స్పోర్ట్స్‌ డ్రామాని ఎంచుకున్నాడు. బాక్సింగ్‌ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించిన టైటిల్.. ఫ్యాన్‌ మేడ్ పోస్టర్ ఆస‌క్తిని రేకెత్తించింది.

జనవరి 19న వరుణ్‌ తేజ్‌ బర్త్‌డే సందర్బంగా ఈ లుక్ ని ఫ్యాన్స్ ప్ర‌త్యేకంగా డిజైన్ చేసి రివీల్ చేయ‌డం విశేషం. టైటిల్‌ లోగో దాంతో పాటే ఆర‌డుగుల బుల్లెట్టు లాంటి వరుణ్ సీరియ‌స్ గా బాక్సింగ్ ప్రాక్టీస్ చేస్తున్న లుక్ ని రిలీజ్ చేశారు. వాస్త‌వానికి ఈ పోస్ట‌ర్ రాగానే ఇదే అధికారిక లుక్ అంటూ అంద‌రూ ఫిక్స‌యిపోయారు. కానీ ఇది కేవ‌లం ఫ్యాన్ మేడ్ పోస్ట‌ర్ మాత్ర‌మే. చిత్ర‌బృందం అధికారిక పోస్ట‌ర్ ని రిలీజ్ చేయాల్సి ఉంది.

బాక్సింగ్ నేప‌థ్యంలోని ఈ సినిమా కోసం వ‌రుణ్ పూర్తిగా రూపాన్ని మార్చేస్తున్నాడు. లాంగ్ హెయిర్.. భీక‌ర‌మైన రూపంతో వ‌రుణ్ క‌నిపించ‌బోతున్నాడు. 6ప్యాక్ యాబ్స్ తోనూ వ‌రుణ్ ఫ్యాన్స్ కి ట్రీటివ్వ‌బోతున్నాడ‌న్న టాక్ ఉంది. ప్ర‌స్తుతం ముంబైలో ప్రొఫెషనల్‌ బాక్సర్‌ నీరజ్‌ గోయత్‌ పర్యవేక్షణలో బాక్సింగ్‌ ప్రాక్టిస్ కి సిద్ధ‌మ‌య్యాడ‌ని ఇప్ప‌టికే ప్ర‌చార‌మైంది. వ‌రుణ్ న‌టిస్తున్న ప‌ద‌వ చిత్ర‌మిది. బాక్స‌ర్ ఫ్యాన్ మేడ్ పోస్ట‌ర్ జెట్ స్పీడ్ తో దూసుకెళుతోంది. త్వ‌ర‌లోనే రెగ్యుల‌ర్ చిత్రీక‌ర‌ణ‌ను ప్రారంభించ‌నున్నారు. అల్లు అరవింద్ సమర్పణలో అల్లు వెంకటేష్‌- సిద్ధు ముద్దాలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కిరణ్‌ కొర్రపాటి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నాడు.