Begin typing your search above and press return to search.

స్టార్ హీరో చిత్రంలో ఇండియ‌న్ బాక్స‌ర్!

By:  Tupaki Desk   |   31 Oct 2022 7:30 AM GMT
స్టార్ హీరో చిత్రంలో ఇండియ‌న్ బాక్స‌ర్!
X
బాలీవుడ్ ఇండ‌స్ర్టీకి- క్రీడాకారుల‌కు మ‌ధ్య ఉన్న అనుబంధం గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. రెండు వేర్వేరు రంగాలైనా జ‌నాల్లో పాపుల‌ర్ అయిన రంగాలు కావ‌డంతో? అవి రెండు జ‌నాల్లో ఎప్ప‌టిక‌ప్పుడు హాట్ టాపిక్. క్రీడాకారుల బ‌యోపిక్ లు హిందీలో తెర‌కెక్క‌డం..వాటి ద్వారా ఇండ‌స్ర్టీ స‌క్సెస రేట్ మెరుగుప‌రుచుకోవ‌డం వంటివి స‌హ‌జంగానే చోటు చేసుకుంటున్నాయి.

ఇప్ప‌టికే చాలా మంది క్రీడాకారులు బ‌యోపిక్ లు తెర‌కెక్కాయి. ఇటీవ‌లే మాజీ క్రికెట‌ర్ ధోనీ సైతం నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టిన సంగ‌తి తెలిసింది. ధోనీ భార్య‌ సాక్షి పేరిట ఓ నిర్మాణ సంస్థ‌ని స్థాపించి తొలి ప్ర‌య‌త్నంగా త‌మిళ్ లో ఓ సినిమా నిర్మిస్తున్నారు. ఇక్క‌డ నుంచి ధోనీ ప్ర‌యాణం నిర్మాత‌గా బాలీవుడ్ స‌హా ఇత‌ర భాష‌ల్లో కొన‌సాగే అవ‌కాశం ఉంది.

ఇంకా చాలా మంది క్రీడాకారులు ప‌రోక్షంగా సినిమా రంగంలో పెట్టుబ‌డులు పెడుతున్నారు. అలాగే సెల‌బ్రిటీలు క్రికెట్ రంగంలోనూ భాగ‌స్వాములుగా మారుతున్నారు. ఆ మ‌ధ్య శ్రీశాంత్ కూడా న‌టుడిగా తెరంగేట్రం చేసిన సంగ‌తి తెలిసిందే.

తాజాగా ఇండియ‌న్ బాక్స‌ర్ విజేంద‌ర్ సింగ్ కూడా న‌టుడిగా ఎంట్రీ ఇస్తున్నాడు. బాలీవుడ్ స్టార్ హీరో స‌ల్మాన్ ఖాన్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తోన్న 'కిసీకా భాయ్..కిసీకా జాన్' చిత్రంలో విజేంద‌ర్ సిగ్ ఓ కీల‌క పాత్ర పోషిస్తున్న‌ట్లు యూనిట్ వెల్ల‌డించింది.

విజేంద‌ర్ సింగ్ పుట్టిన రోజు సంద‌ర్భంగా ఈ విష‌యాన్ని స్వ‌యంగా స‌ల్మాన్ ప్ర‌క‌టించ‌డం విశేషం. ఆయ‌న‌తో క‌లిసి సెట్ లో ఉన్న ఓ ఫోటోని స‌ల్మాన్ పంచుకున్నారు. బాక్స‌ర్ సోద‌రా...జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు. వెల్క‌మ్ ఆన్ బోర్డ్ అంటూ రాసుకొచ్చారు. విజేంద‌ర్ సింగ్ గొప్ప బాక్స‌ర్ గా.. ఒలింపిక్స్ ప‌త‌క విజేత‌గా దేశానికే గ‌ర్వ‌కార‌ణంగా నిలిచారు.

తాజాగా స‌ల్మాన్ సినిమాతో విజేంద‌ర్ సింగ్ ఎంట్రీ ఇవ్వ‌డంతో బాలీవుడ్ ఇండ‌స్ర్టీ గ‌ర్వంగా చెప్పుకుంటుంది. మ‌రి ఇందులో విజేంద‌ర్ సింగ్ ఎలాంటి పాత్ర పోషిస్తున్నారు? అన్న వివ‌రాలు మాత్రం ఇంకా బ‌య‌ట‌కు రాలేదు. ఈ సినిమాలో వెంక‌టేష్..జ‌గ‌ప‌తి బాబు కూడా కూడా కీల‌క పాత్ర‌లు పోషిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాతోని తెలుగులోనూ భారీ స్థాయిలో రిలీజ్ చేయాల‌ని ప్లాన్ చేస్తున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.