Begin typing your search above and press return to search.
ట్రెండీ టాక్: ఎందుకింత సైలెన్స్ ఫైటర్స్?
By: Tupaki Desk | 17 Dec 2020 12:30 AM GMTకొన్నిసార్లు ఆర్భాటంగా ప్రకటించి షూటింగ్ లో స్లో అయిపోతే జనాల్లో దానిపై సందేహాలు నెలకొంటాయి. అలా ఓ రెండు క్రేజీ ప్రాజెక్టుల అప్ డేట్ రాకపోవడంతో ఫిలింసర్కిల్స్ లో ఆరాలు మొదలయ్యాయి.
బాక్సింగ్ నేపథ్యంలో వస్తున్న వరుణ్ తేజ్ సినిమా.. అలానే విజయ్ దేవరకొండ ఫైటర్ మూవీ ఎనౌన్స్ మెంట్ జరిగి నెలలు గడుస్తున్నా ఎలాంటి అప్ డేట్ లేదు ఎందుకనో..! ఏదో నాలుగైదు గాసిప్స్ వదిలారు మినహా ఈ సినిమాలపై చిత్రబృందాల నుంచి ఎలాంటి అధికారిక ప్రకటనలు లేవు.
ఎప్పుడూ చకచక సినిమాలు తీసే పూరీ సైతం చడీ చప్పుడు లేకుండా ఉన్నారు. దేవరకొండ సినిమాకు చాలా టైమ్ తీసుకుంటున్నట్లుగా అనిపిస్తోంది. ఈ ప్రాజెక్ట్ కి ఫైనాన్స్ సమస్యలున్నాయని ఆ మధ్య ఏవో పుకార్లు వినిపించినా బాలీవుడ్ దిగ్గజ నిర్మాత కరణ్ జోహార్ టీమ్ ఇన్వాల్వ్ మెంట్ తో ఇప్పుడు ఈ సినిమాకు పెట్టుబడుల పరంగా ఎలాంటి ఇబ్బందులు లేవట.
అసలు ఆలస్యానికి కారణమేమిటో ఆరా తీస్తే.. ఫైటర్ మూవీకి ఫారిన్ లొకేషన్స్ లో విదేశీ ఫైటర్స్ తో భారీ ఫైట్స్ తీయాల్సి ఉంటుందిట. కరోనా వల్ల షూట్ సాధ్యపడలేదు ఇన్నాళ్లు. ఇప్పటికి ముంబైలో జనవరి నుంచి షూటింగ్ తీయడానికి అనుమతులు వచ్చాయిట. విదేశీ ఫైటర్లను అక్కడికి రప్పిస్తున్నారని సమాచారం. ఇక వరుసగా ఫైటర్ గురించి పూరి ప్రచారం మొదలైపోతుందనే భావిస్తున్నారు.
ఇక మరోవైపు ఎంతో క్రేజీగా మొదలైన వరుణ్ తేజ్ బాక్సింగ్ నేపథ్యంలోని సినిమా ఓ ఏడు రోజులు షూటింగ్ జరిపి ఆపేశారు! ఆ తర్వాత ఇటీవల సరైన అప్ డేట్ అన్నదే లేదు. అయితే ఇలా ఎందుకవుతోంది? అంటే.. బహుశా ఈ ఇద్దరు హీరోలు పర్ఫెక్షన్ కోసం నెలలు తరబడి బాక్సింగ్ లో కోచింగ్ తీసుకుంటున్నారా! ఆ సంగతి పక్కనపెడితే ఈ సినిమాలు ఉన్నాయని జనాలు మర్చిపోతారేమో అది కాస్త ఆలోచిస్తే బెటర్! అని కౌంటర్లు పడుతున్నాయి. మరి వీటికి సమాధానం చెబుతారేమో చూడాలి.