Begin typing your search above and press return to search.
ఆల్ ఓవర్ ఇండియా బాక్సింగ్ ఫీవర్..!!
By: Tupaki Desk | 18 July 2021 2:30 AM GMTభారతీయ సినీ ఇండస్ట్రీలో ఈ మధ్య స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో రూపొందే సినిమాలు ఎక్కువ అయ్యాయి. 'ఆట'కు ఎమోషన్స్ - కమర్షియల్ ఎలిమెంట్స్ కలబోసి ప్రేక్షకులను మెప్పించడానికి ఫిలిం మేకర్స్ అందరూపోటీ పడుతున్నారు. ముఖ్యంగా బాక్సింగ్ క్రీడ ఆధారంగా రాసుకున్న కథలతో ఈ ఏడాది ఎక్కువ చిత్రాలు వచ్చాయి. తెలుగు తమిళ హిందీ భాషల్లో ఇప్పటికే బాక్సింగ్ నేపథ్యంలో అనేక సినిమాలు వచ్చాయి.. మరికొన్ని సినిమాలు రాబోతున్నాయి. వాస్తవానికి బాక్సింగ్ స్పోర్ట్స్ డ్రామా చిత్రాల్లో నటించడం అంటే అంత ఆషామాషీ విషయం కాదు. ఎందుకంటే ఒక బాక్సర్ గా కనిపించడానికి మానసికంగా శారీరకంగా ఎంతో కష్టపడాల్సి ఉంటుంది. రెగ్యులర్ గా భారీ వర్కౌట్స్ చేస్తూ.. పర్ఫెక్ట్ డైట్ ఫాలో అవుతూ ఫిజిక్ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. మంచి కథతో పాటుగా హీరో కూడా ప్రొఫెషనల్ బాక్సర్ అనిపించుకుంటేనే ఆడియన్స్ మెప్పు పొందగలుగుతారు. ప్రస్తుతం బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న సినిమాలు - బాక్సర్ గా కనిపిస్తున్న హీరోలెవరో ఒకసారి చూద్దా!
''తుఫాన్'' ౼ బాలీవుడ్ స్టార్ హీరో ఫర్హాన్ అక్తర్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ హిందీ చిత్రం ఇటీవలే ఓటీటీ వేదికగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ చిత్రం పాజిటివ్ టాక్ తో నడుస్తోంది. ప్రేమలో పడిన తర్వాత ఓ స్ట్రీట్ ఫైటర్.. జాతీయ స్థాయి బాక్సర్ గా ఎలా మారాడు అనే కథాంశంతో 'తుఫాన్' సినిమా రూపొందింది. ఈ సినిమాలో హరియాణా, మహారాష్ట్ర ప్రాంతాలకు చెందిన ప్రొఫెషనల్ బాక్సర్లతో ఫర్హాన్ తలపడ్డాడు. దీని కోసం కఠిన శిక్షణ తీసుకున్నారు. 'భాగ్ మిల్కా భాగ్' ఫేమ్ రాకేశ్ ఓం ప్రకాశ్ మెహ్రా ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇందులో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రాన్ని రితేష్ సిద్వానీ - రాకేశ్ ఓం ప్రకాశ్ మెహ్రా - ఫర్హాన్ అక్తర్ కలిసి నిర్మించారు.
''సార్పట్ట పరంబరై'' ౼ తమిళ స్టార్ హీరో ఆర్య ప్రధాన పాత్రలో 'కబాలి' 'కాలా' ఫేమ్ పా. రంజిత్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. 1975లో ఉత్తర మద్రాస్ లో ఉండే బాక్సింగ్ కల్చర్ ని చూపిస్తూ.. బాక్సింగ్ వారసత్వం కోసం సర్పట్టా - ఇడియప్ప అనే రెండు వంశాల మధ్య జరిగే పోరాటాన్ని ఈ చిత్రంలో చూపించబోతున్నారు. ఇందులో బాక్సర్ గా కనిపించడానికి ఆర్య ఫుల్ హార్డ్ వర్క్ చేయడంతో పాటుగా జాతీయ స్థాయి బాక్సర్ల దగ్గర శిక్షణ తీసుకున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ - ట్రైలర్ లలో ఆర్య లుక్ ని చూస్తే 'సార్పట్ట' కోసం అతను ఎంతలా కష్టపడ్డాడో అర్థం అవుతుంది. నీలం ప్రొడక్షన్స్ సమర్పణలో కె9 స్టూడియోస్ బ్యానర్ పై షణ్ముగం దక్షణ రాజ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. తెలుగు తమిళ భాషల్లో జూలై 22న ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా ఈ సినిమా రిలీజ్ అవుతోంది.
''లైగర్'' ౼ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ - సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో వస్తున్న హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ ఇది. 'సాలా క్రాస్ బ్రీడ్' అనేది దీనికి ట్యాగ్ లైన్. మిక్డ్స్ మార్షల్ ఆర్ట్స్ కథాంశానికి సెటిమెంట్ ని జోడించి ఈ చిత్రాన్ని రెడీ చేస్తున్నారు. బాక్సర్ పాత్ర కోసం విజయ్ మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ కూడా తీసుకున్నాడు. తన లుక్ తో పాటుగా గెటప్ ని కూడా కంప్లీట్ గా చేంజ్ చేశాడు. జాకీచాన్ చిత్రాలకు వర్క్ చేసిన ప్రముఖ హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్ ఆండీ లాంగ్ తో బాక్సింగ్ ఫైట్స్ ని డిజైన్ చేయిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ 60 శాతానికి పైగా పూర్తయింది. ఈ సినిమాతో బాలీవుడ్ భామ అనన్య పాండే టాలీవుడ్ లో అడుగుపెడుతోంది. పూరీ కనెక్ట్స్ & ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై పూరీ - ఛార్మీ కౌర్ - కరణ్ జోహార్ కలిసి 'లైగర్' చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
''గని'' ౼ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా కొత్త దర్శకుడు కిరణ్ కొర్రపాటి ఈ స్పోర్ట్స్ డ్రామాని తెరకెక్కిస్తున్నాడు. బాక్సింగ్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాలో కన్నడ స్టార్ ఉపేంద్ర - బాలీవుడ్ స్టార్ సునీల్ శెట్టి - విలక్షణ నటుడు జగపతిబాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. సైఈ మంజ్రేకర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇటీవలే ఈ సినిమా ఫైనల్ షెడ్యూల్ ప్రారంభమైంది. వర్కౌట్స్ చేసి బాక్సర్ లుక్ లోకి మారిపోయిన వరుణ్.. క్లైమాక్స్ షూట్ లో పాల్గొంటున్నాడు. అల్లు అరవింద్ సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని రెనసాన్స్ పిక్చర్స్ - అల్లు బాబీ కంపెనీ పతాకాలపై అల్లు బాబీ - సిద్ధు ముద్ద సంయుక్తంగా నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీపై క్లారిటీ రానుంది.
ఇదే క్రమంలో తెలుగులో మరో బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ సినిమా సిద్ధమవుతోంది. 'పెళ్లి చూపులు' దర్శకుడు తరుణ్ భాస్కర్ సమర్పణలో 'ఈ నగరానికి ఏమైంది' ఫేం సాయి సుశాంత్ రెడ్డి ప్రధాన పాత్రల్లో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇందులో భైరవ్ అనే బాక్సర్ పాత్రలో సాయి సుశాంత్ కనిపించనున్నాడు. లేటెస్టుగా విడుదలైన గ్లిమ్స్ లో బాక్సింగ్ చేస్తూ కనిపించిన సాయి.. తన బాడీతో అందరినీ ఆకట్టుకున్నాడు. రోహిత్ తంజావూర్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. ప్రమోద్ కుమార్ - నాగరాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఇదంతా చూస్తుంటే ఇప్పుడు ఆల్ ఓవర్ ఇండియా బాక్సింగ్ ఫీవర్ పట్టుకున్నట్లు అర్థం అవుతోంది. ఒక్కసారిగా అన్నీ బాక్సింగ్ కథలతో సినిమాలు వస్తున్నాయి. దీనిని బట్టి ప్రస్తుతానికైతే ఇండస్ట్రీలో బాక్సింగ్ ట్రెండ్ నడుస్తోందని చెప్పవచ్చు.