Begin typing your search above and press return to search.

#బాక్సాఫీస్‌: ఉప్పెన రెండ్రోజుల వ‌సూళ్లు

By:  Tupaki Desk   |   14 Feb 2021 6:45 AM GMT
#బాక్సాఫీస్‌: ఉప్పెన రెండ్రోజుల వ‌సూళ్లు
X
తుఫాన్ వెలిశాక నిశ్శ‌బ్ధంలా తొలుత అనిపించినా.. క‌రోనా వెలిశాక ఏం జ‌రుగుతుందోన‌ని బ‌య‌పడినా.. ఇప్పుడు `ఉప్పెన` వ‌సూళ్లు చూశాక మాత్రం అంతా రివ‌ర్సులో ఉంద‌ని అంటారు. క‌రోనా వెళ్లాక ఓటీటీల‌దే రాజ్యం అనుకుంటే అది నిజం కాద‌ని ప్రూవ్ చేస్తోంది ఉప్పెన‌. ఈ సినిమా థియేట్రిక‌ల్ రిలీజ్ కోసం వేచి చూసి వ‌సూళ్ల తుఫాన్ తో చెల‌రేగుతోంది. ఒక ర‌కంగా థియేట‌ర్ల భ‌విష్య‌త్ పైనా భ‌రోసా పెంచింది.

మొద‌టి రోజే 10 కోట్ల షేర్ (గ్రాస్ ఇంచుమించు డ‌బుల్) తో సంచ‌ల‌నం సృష్టించింది ఉప్పెన‌. పాత డెబ్యూ ఓపెనింగుల‌ రికార్డుల‌న్నిటినీ మెగా మేన‌ల్లుడు వైష్ణ‌వ్ తేజ్ బ్రేక్ చేశాడు. ఇక రెండో రోజు అదే స్పీడ్ ని కొన‌సాగిస్తూ 20కోట్ల షేర్ క్ల‌బ్ కు చేరువ‌య్యాడు. రెండో రోజుకు షేర్ వివ‌రాలు ప‌రిశీలిస్తే...

నైజాం 5.75 కోట్లు.. వైజాగ్ 2.67 కోట్లు ..తూ.గో జిల్లా 1.63కోట్లు.. ప‌.గో జిల్లా 1.13 కోట్లు.. కృష్ణ 1.10 కోట్లు.. గుంటూరు 1.42 కోట్లు.. నెల్లూరు 0.58 కోట్లు.. సీడెడ్ 2.45 కోట్లు వ‌సూలు చేసింది. తెలంగాణ‌- ఎపి క‌లుపుకుని రెండ్రోజుల్లో 16.73కోట్ల షేర్ వ‌సూలైంది. విదేశాల నుంచి 70ల‌క్ష‌లు.. కర్ణాటక నుంచి 86 లక్షలు... తమిళనాడు నుంచి 30 ల‌క్ష‌లు.. రెస్ట్ ఆఫ్ ఇండియా 18 లక్షలు వ‌సూలు చేసింది. ఉప్పెన టోట‌ల్ గా రెండ్రోజుల‌కు 18.77 కోట్లు అంటే సుమారు 19 కోట్లు వ‌సూలైంద‌ని మైత్రి నుంచి అధికారిక స‌మాచారం అందింది.