Begin typing your search above and press return to search.

కంగారు ఏమొచ్చింది బోయపాటి?

By:  Tupaki Desk   |   2 Feb 2018 4:52 AM GMT
కంగారు ఏమొచ్చింది బోయపాటి?
X
మాస్ చిత్రాలు తీయడంలో బోయపాటి శ్రీను సిద్ధహస్తుడు. ఆయన సినిమాల్లో యాక్షన్ సీన్లు ఓ రేంజిలో ఉండటమే కాదు.. ప్రేక్షకులతో విజిల్స్ వేయించేస్తాయి. తనకున్న ఈ బలాన్నే సమర్ధంగా వాడుకుంటూ వరస హిట్లతో దూసుకుపోతున్నాడు. యాక్షన్ సీన్లే కాదు.. యమ ఫాస్ట్ గా సినిమాలు తీయడంలోనూ బోయపాటి స్పెషల్ అని ముందు ముందు చెప్పుకోవాలేమో. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ తో బోయపాటి ప్రస్తుతం తీస్తున్న సినిమా షూటింగ్ జోరు అలా ఉంది మరి.

ప్రస్తుతం రామ్ చరణ్ తేజ్ సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న రంగస్థలం సినిమా షూటింగ్ పైనల్ పనుల్లో ఉన్నాడు. దీని తరవాత బోయపాటి శ్రీనుతో సినిమా చేయబోతున్నాడు. రామ్ చరణ్ తేజ్ ఇంకా రంగస్థలం షూటింగ్ నుంచి పూర్తిగా రిలీవ్ కాకముందే బోయపాటి సినిమా షూటింగ్ పని మొదలుపెట్టేసి ఓ షెడ్యూల్ కూడా పూర్తి చేశాడు. రామ్ చరణ్ మూవీ షూటింగ్ సమ్మర్ నాటికి పూర్తి చేయాలని బోయపాటి అనుకుంటున్నాడనే న్యూస్ టాలీవుడ్ లో ఇప్పుడు షాకింగ్ గా మారింది. జులైనాటికల్లా పోస్ట్ ప్రొడక్షన్ కూడా పూర్తి చేసి జులైనాటికి సినిమా రిలీజ్ చేసేద్దామని అనుకుంటున్నాడట. ఇంత స్పీడుగా సినిమా చుట్టేయాల్సిన అంత కంగారు ఏమొచ్చిందని ఫ్యాన్స్ తెగ సందేహపడిపోతున్నారు.

రామ్ చరణ్ రంగస్థలం సినిమా షూటింగ్ కోసం బోలెడు టైం కేటాయించాడు. వాస్తవానికి ఈ సినిమా ఎప్పుడో కంప్లీట్ కావాల్సి ఉంది. సుకుమార్ షూటింగ్ స్లోగా సాగించడంతో ప్రాజెక్ట్ డిలే అయింది. ఇందుకు పూర్తి భిన్నంగా బోయపాటి ఏమో మరీ స్పీడ్ తో ముందుకు వెళ్తున్నాడు. రంగస్థలం మార్చి ఆఖరుకు థియేటర్లకు రానుంది. బోయపాటి ప్లానింగ్ వర్కవుట్ అయితే రంగస్థలం వచ్చిన మూడు నెలల్లోనే రామ్ చరణ్ తరవాత మూవీ అభిమానుల ముందుకొచ్చేస్తుందన్న మాట.