Begin typing your search above and press return to search.
రజనీ తరువాత గజినీనే: బోయపాటి
By: Tupaki Desk | 4 March 2022 3:54 AM GMTసూర్య హీరోగా రూపొందిన 'ఈటి' ఈ నెల 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ 'దసపల్లా హోటల్'లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్య అతిథుల్లో ఒకరిగా బోయపాటి వచ్చారు. 'జై బాలయ్య' అంటూ ఆయన తన ప్రసంగాన్ని మొదలుపెట్టడం విశేషం. "ముందుగా ఇక్కడ ఉన్న గెస్టులకు .. ఈ సినిమా మంచిగా ఆడాలని కోరుకుంటున్న ప్రతి ఒక్క టెక్నీషియన్ కీ .. ఆర్టిస్టులకు నేను ఆల్ ది బెస్ట్ .. కంగ్రాట్స్ చెబుతున్నాను. రామ్ - లక్ష్మణ్ ఫైట్స్ బాగా చేస్తారు. అలాంటిది ఈ రోజున వాళ్లు స్పీచ్ కూడా అద్భుతంగా ఇచ్చారు.
ఇక ఆ తరువాత సూర్య గారి గురించి జానీ మాస్టర్ .. గోపీచంద్ మలినేని గొప్పగా మాట్లాడారు. ఇలా అందరూ మాట్లాడుకుంటూ పోతే టైమ్ ఉండదు బ్రదర్. కానీ వీళ్లందరూ మాట్లాడిన తరువాత నాకు ఒకటి అర్థమైంది. సూర్యగారి గురించి అంతా యూనిక్ గా చెప్పింది ఒక్కటే. సూర్యగారు ఒక ఛారిటీ పెట్టి ఎంతోమందికి హార్ట్ ఆపరేషన్స్ చేయిస్తున్నారు. ఇలా చేయడం వలన వాళ్లు మాత్రమే కాదు .. వాళ్ల పిల్లలు .. ఆ తరువాత జనరేషన్స్ కూడా బాగుంటారు. బాలయ్యగారు కూడా కేన్సర్ హాస్పిటల్ ద్వారా ఎంతోమందికి సహాయ సహకారాలను అందిస్తున్నారు.
అలాగే మెగాస్టార్ చిరంజీవిగారు బ్లడ్ బ్యాంకు పెట్టి ఎక్కడ ఎవరికీ బ్లడ్ అవసరమో వారికి అది అందజేస్తూ ఉంటారు. అలాగే సూర్యగారు కూడా ఎంతోమందికి తనకి తోచిన విధంగా చేయూతనిస్తూ వెళుతున్నారు. అందువలన వాళ్లంతా కూడా ఎప్పుడూ బాగానే ఉంటారు. అలా ఉండాలనే కోరుకుంటున్నాను. ఎందుకంటే మంచి వాళ్లు అంతరించిపోతున్న టైమ్ ఇది. అలాంటి ఈ టైమ్ లో ఇలాంటి వాళ్లంతా మనకి అవసరమే. వాళ్లు బాగుంటేనే మనం బాగుంటాము.
ఇక సినిమా విషయానికి వస్తే .. తెలుగు ప్రేక్షకులకు ఒక అలవాటు ఉంది. వాళ్లు మదర్ లాంగ్వేజా .. అదర్ లాంగ్వేజా అనేది చూడరు. మంచి సినిమానా కాదా అని చూస్తారంతే. మంచి సినిమా అయితే వెంటనే ఎంకరేజ్ చేస్తారు .. అదే తెలుగు ఆడియన్స్ అంటే. ఇక్కడివారు ఇది సూర్య గారి సినిమా అనుకోరు .. ఇది మన సినిమా అని ఫీలవుతారు. ఆయనను తెలుగు ఆడియన్స్ అంతగా ఓన్ చేసుకున్నారు. రజనీకాంత్ తరువాత అంతగా ఇక్కడి వారు ఓన్ చేసుకున్నది సూర్యనే. వాళ్ల హృదయాలలో ఆయన ఎప్పుడూ అలాగే ఉండాలి. అలాంటి సూర్య నుంచి వస్తున్న ఈ సినిమా ప్రేక్షకుల ఆదరణ పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను" అని చెప్పుకొచ్చారు.