Begin typing your search above and press return to search.

చ‌ద‌రంగంలో ఆ ఇద్ద‌రు ద‌ర్శ‌కులు తాడో పేడో!

By:  Tupaki Desk   |   24 Oct 2022 11:30 PM GMT
చ‌ద‌రంగంలో ఆ ఇద్ద‌రు ద‌ర్శ‌కులు తాడో పేడో!
X
ప‌రిశ్ర‌మ‌లో స్నేహం శ‌త్రుత్వం చాలా స‌హ‌జం. ఇక్క‌డ అప్ప‌టివ‌ర‌కూ స్నేహితులుగా ఉన్నా కానీ క్రియేటివ్ డిఫ‌రెన్సెస్ ఇద్ద‌రినీ విడదీస్తుంటాయి. ఇంత‌కుముందే స‌ల్మాన్ ఖాన్ - సాజిద్ న‌డియా వాలా మిత్ర‌ద్వ‌యం క్రియేటివిటీ డిఫరెన్సెస్ కార‌ణంగా ఒక‌రికొక‌రు విడిపోయారు. ఈ ఇద్ద‌రి అనుబంధం ద‌శాబ్ధాల నాటిది. కానీ ఎవ‌రి దారిలో వారు వెళ్లారు. అయితే ఇది కొద్దిరోజులు లేదా సంవ‌త్స‌రాల వ‌ర‌కే. మ‌ళ్లీ ఏదైనా సినిమా కోసం క‌లిసేందుకు ఆస్కారం లేక‌పోలేదు.

ఇక‌పోతే ఇలాంటి క్రియేటివ్ డిఫ‌రెన్సెస్ తో చాలా జోడీలు టాలీవుడ్ లోను విడిపోయాయి. ఇంత‌కుముందు శ్రీ‌నువైట్ల‌- కోన వెంక‌ట్ మధ్య క్రియేటివ్ డిఫ‌రెన్సెస్ గురించి బ్రేక‌ప్ గురించి తెలిసిన వ్య‌వ‌హార‌మే. అలాగే మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటితో ర‌చ‌యిత‌ కొర‌టాల శివ విభేధాలు విధిత‌మే. సింహా సమయంలో సృజనాత్మక విభేదాల కారణంగా ఆ ఇద్ద‌రు స్నేహితులు విడిపోయారు. అప్పటి నుండి ఇరు శిబిరాల మధ్య ఒక ర‌క‌మైన పోరు క‌నిపిస్తోంది. ఎవ‌రికి వారు ఎత్తుకు ఎదిగేందుకు ఎత్తుగ‌డ‌ల‌తో ముందుకు సాగుతున్నారు.

కొరటాల శివకు కెరీర్ లో రెండు బిగ్గెస్ట్ హిట్ లు ఉన్నాయి. ఇది అతనికి అగ్ర దర్శకుడిగా ట్యాగ్ ని తెచ్చిపెట్టింది. ఇది వైరి (లేదా స్నేహితుడు) వ‌ర్గానికి ఇబ్బందికరం. అయితే ఆచార్య పరిశ్రమలో అతిపెద్ద డిజాస్ట‌ర్ గా నిలిచిపోవడంతో కొర‌టాల వెన‌కంజ‌లో ఉన్నాడు. ఇక అఖండ వంటి బంప‌ర్ హిట్ చిత్రంతో బోయపాటి రేసులో ముందుకు దూసుకొచ్చాడు.

ఇప్పటికే అఖండ సూపర్ హిట్ కొట్టిన ఆయన ప్రస్తుతం రామ్ తో సినిమా చేస్తున్నాడు. ఇప్పుడు కొరటాల కెరీర్ లో అత్యల్ప దశలో ఉండగా బోయపాటి బెస్ట్ లో ఉన్నాడు. కొరటాలను తనదైన ఆటలో ఓడించేందుకు బోయపాటికి ఇదే సరైన సమయం. ఈ చిత్రం పాన్-ఇండియన్ చిత్రమ‌ని టాక్ వినిపిస్తోంది. తాత్కాలికంగా #Rapo20 అని పేరు పెట్టారు. బోయపాటి సినిమాని సెన్సేషనల్ హిట్ చేయడానికి చాలా కష్టపడుతున్నాడు.

అయితే కొర‌టాల శివ ప్ర‌స్తుతం యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ తో అంత‌కుమించి ప్లాన్ చేస్తున్నాడు. ఇది కూడా పాన్ ఇండియ‌న్ సినిమా అన్న టాక్ ఉంది. ఇప్పుడు తార‌క్ కోసం అత‌డు అమాంతం కాన్వాస్ మార్చేశాడు. ఆర్.ఆర్.ఆర్ లాంటి సెన్సేష‌న‌ల్ హిట్ లో న‌టించిన ఎన్టీఆర్ ని మ‌ళ్లీ అదే రేంజులో ఆవిష్క‌రించేందుకు కొర‌టాల తీవ్రంగా శ్ర‌మిస్తున్నాడ‌ని టాక్ ఉంది. అంటే బోయ‌పాటికి కౌంట‌ర్ వేసేందుకు కొర‌టాల‌కు కూడా ఆస్కారం ఉంది.

ఇక్క‌డ ఎవ‌రి ఆట ఎప్పుడు ఎలా సాగుతుందో ఊహించ‌లేం. చ‌ద‌రంగంలో పావులు ఎట్నుంచి ఎటు క‌దులుతాయో కూడా గ్ర‌హించ‌లేం. నిచ్చెనల‌న్నీ ఎక్కేసినా చివ‌రిలో పాము మింగితే కిందికి దిగిపోవాలి. లేదా పాము మింగేసిన త‌ర్వాత కూడా ఒకే దెబ్బ‌కు ప‌ది నిచ్చెన‌లు ఎక్కి గోల్ ని చేరుకున్న అదృష్ట‌వంతులు ఉంటారు. మ‌రి ఆ ఇద్ద‌రూ ఏ జాబితాలో నిలుస్తారో వేచి చూడాలి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.