Begin typing your search above and press return to search.

ఆ ఇద్దరికీ బోయపాటి ఫీవర్... ?

By:  Tupaki Desk   |   12 Dec 2021 2:30 AM GMT
ఆ ఇద్దరికీ బోయపాటి ఫీవర్... ?
X
బోయపాటి శ్రీను. హై ఓల్టేజి తో వెండి తెర మీద మంట పెట్టే పక్కా ఊర మాస్ డైరెక్టర్. ఆయన తొలి చిత్రం భద్ర దగ్గర నుంచి ఇదే స్పీడ్ చూపిస్తున్నారు. హీరో యాంగిల్ లో స్టోరీ రాసుకుని స్క్రీన్ మీద బీభత్సం క్రియేట్ చేయడంతో బోయపాటిని మించి వారు లేరు. ఆయన సినిమా అంటే టన్నుల కొద్దీ యాక్షన్ ఉండి తీరాల్సిందే. బోయపాటి మొదటి నుంచి దాన్నే నమ్ముకున్నారు. మెజారిటీ మూవీస్ అలాగే హిట్ చేయించారు.

ఇక బోయపాటి హై ఓల్టేజిని వెండి తెర మీద పండించే హీరో ఎవరూ అంటే కచ్చితంగా బాలక్రిష్ణ పేరు మొదట చెప్పుకోవాలి. బాలయ్య కోసమే బోయపాటి డైలాగ్స్ రాస్తారా లేక బోయపాటి రాసినవి తన నోట్లో చెబితేనే కరెక్టా అన్నది తెలియదు కానీ ఈ ఇద్దరి సినిమా అంటే భారీ డైలాగులకు పెట్టింది పేరుగానే చూడాలి.

ఇదిలా ఉంటే బోయపాటి బాలక్రిష్ణ కాంబో అంటే బ్లాక్ బస్టర్ అని చెప్పాల్సిందే. దానికి లేటెస్ట్ రుజువు అఖండ మూవీ. ఈ సినిమా క్రియేట్ చేసిన సెన్సేషన్ అంతా ఇంతా కాదు, ఈ మూవీ విషయంలో స్పెషల్ ఏంటి అంటే బోయపాటి ఎలివేషన్ గురించే. బాలయ్యని ఎక్కడో తెచ్చి పెట్టేశాడు. ఈ మూవీలో ఒక క్లైమాక్స్ ఉండదు, వరసబెట్టి అలా ఎన్నో ఉంటాయి.

ఇంత గొప్పగా బాలయ్యను మరెవరు అయినా ఎలివేట్ చేయగలరా అన్న డౌట్లు కలిగేలా బోయపాటి ఈ మూవీని డిజైన్ చేసి అదిరిపోయే హిట్ కొట్టారు. సరే మొత్తానికి అఖండ మూవీ రిలీజ్ అయింది, అనుకున్నట్లుగా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. అయితే ఈ మూవీ తరువాత బాలయ్య సినిమాలు చేస్తున్న ఇద్దరు డైరెక్టర్లకు యమ టెన్షన్ పట్టుకుందిట. వారే గోపీచంద్ మలినేని, అనిల్ రావిపూడి.

ఈ ఇద్దరూ వరసబెట్టి బాలయ్యతో సినిమాలు చేయబోతున్నారు. ముందుగా గోపీచంద్ మూవీ ఉంది. క్రాక్ మూవీ తరువాత ఆయన చేస్తున్న మూవీ ఇది. ఫుల్ ఆఫ్ యాక్షన్ తో పాటు సెంటిమెంట్ ని మిక్స్ చేసి ఈ మూవీ తీయడానికి గోపీచంద్ రెడీ అవుతున్నారు. అయితే బాలయ్యను అఖండగా చూసిన కళ్ళకు గోపీ మూవీ చూడాలి అంటే అంతకు మించి అన్నట్లుగా ఉండాలి.అలా అయితేనే ఆడియన్స్ కి పడుతుంది.

మరి ఆ రకంగా బోయపాటి ఎలివేషన్స్ కే ఎలివేషన్స్ తెచ్చి బాలయ్యని ఇంకా ఎత్తున నిలబెట్టాలి. ఇక అనిల్ రావిపూడి స్కూల్ వేరు. ఆయన యాక్షన్ మూవీస్ మొదట్లో తీసినా పక్కా మాస్ మసాలా అయితే తీయలేదు. బాలయ్య అంటే మాసిజానికి మారు పేరు. ఆయనతో అనిల్ బంపర్ హిట్ కొట్టాలి అంటే బోయపాటి అఖండను మించిపోయేలా ఊర మాస్ కధ అయి ఉండాలి. దాంతోనే ఇపుడు ఈ ఇద్దరు డైరెక్టర్స్ సీరియస్ గానే బాలయ్య స్టోరీస్ మీద ఆలోచిస్తున్నారని టాక్. చూడాలి మరి బ్యాక్ టూ బ్యాక్ హిట్లు పడితే అటు బాలయ్యకే కాదు, ఇటు ఈ ఇద్దరూ కూడా ఎక్కడో ఉంటారు. నో డౌట్.