Begin typing your search above and press return to search.
టీడీపీ యాడ్లపై బోయపాటి సంపాదన
By: Tupaki Desk | 10 April 2019 6:02 AM GMTఎలక్షన్ వస్తే మాకేంటి? అని అడగొద్దు. ఎలక్షన్ కొందరికి కాసుల కలశం లాంటిది. దండుకునేవాళ్లకు దండుకున్నంత. ఈసారి ఎన్నికల్లో క్యాంపెయినర్లుగా ఉన్న స్టార్లు, ప్రకటనలకు పని చేసిన యాడ్స్ డైరెక్టర్లు, మ్యూజిక్ డైరెక్టర్లు .. ఇలా అందరూ తలో పిడికెడు సంపాదించుకున్నారని తెలుస్తోంది. అవకాశం వచ్చినప్పుడే నాలుగు కాసులు వెనకేసుకోవాలన్న సూత్రాన్ని తూ.చ తప్పక పాటించి లాభపడ్డారట.
తెలుగు దేశం.. వైయస్సార్ సీపీ పార్టీలు ఈ ఎన్నికల్లో ప్రచారం కోసం పెద్ద ఎత్తున వాణిజ్య ప్రకటనల కోసం ఖర్చు చేసిన సంగతి తెలిసిందే. తమ పార్టీ అధినాయకుల్ని గెలిపించాల్సిందిగా ప్రాధేయపడుతూ రూపొందించిన ప్రకటనలు బుల్లితెరపై సందడి చేస్తున్నాయి. అయితే ఈ ప్రకటనల్లో తేదేపా ప్రకటనలు సంథింగ్ స్పెషల్ అన్న చర్చ జనంలో సాగుతోంది. బోయపాటి మార్క్ మాస్ మసాలాతో అలరిస్తున్నాయని కొందరు సెటైర్లు వేస్తున్నారు.
అంతేకాదు.. తెలుగు దేశం ప్రకటనల్లో మోనోటనీ కామెడీకి టీవీల ముందు జనం పగలబడి నవ్వుతున్నారు. వ్వాటే క్రియేటివిటీ అంటూ సామాజిక మాధ్యమాల్లో తేదేపా యాంటీ ఫ్యాన్స్ ట్రోల్స్ చేయడంపైనా ఆసక్తికర చర్చ సాగుతోంది. అదంతా అటుంచితే ఇన్ని రకాల వెర్షన్లలో ప్రకటనలు రూపొందించిన బోయపాటి శ్రీను పారితోషికం ఎంత అందుకున్నారు? అంటే .. ఏకంగా రూ.4.5 కోట్లకు డీల్ కుదుర్చుకున్నారని తెలిసింది. అయితే ప్రకటనల రూపకల్పన కోసం బోయపాటి గత కొన్ని నెలలుగా ఎంతగా శ్రమించారో చూస్తున్నదే. ప్రకటనల్లో రకరకాల స్కీమ్ ల గురించి తెదేపాను హైలైట్ చేస్తూ డిజిటల్ మీడియాలోనూ చక్కగానే ఎలివేట్ చేశారు.
ఎన్నికలు అయిపోయాక బోయపాటి సన్నివేశమేంటి? అని ప్రశ్నిస్తే అందుకు కూడా సమాధానం రెడీగా ఉంది. తేదేపా నాయకుడు.. నందమూరి బాలకృష్ణ హీరోగా ఓ భారీ మాస్ చిత్రాన్ని తెరకెక్కించేందుకు బోయపాటి రెడీ అవుతున్నారు. అందుకు స్క్రిప్టు పనులు ఇప్పటికే మెజారిటీ పార్ట్ పూర్తి చేశారని తెలుస్తోంది. ప్రీప్రొడక్షన్ పనులు సాగుతున్నాయి. మరిన్ని వివరాలు ఎన్నికల తర్వాత వెల్లడిస్తారట. బోయపాటి తెరకెక్కించిన `వినయ విధేయ రామ` ఈ ఏడాది సంక్రాంతి బరిలో రిలీజై డిజాస్టర్ అయిన సంగతి తెలిసిందే.