Begin typing your search above and press return to search.
బోయపాటి ఎప్పుడూ నాకు పూర్తి కథ చెప్పలేదు
By: Tupaki Desk | 10 Dec 2021 7:44 AM GMTబాలకృష్ణ - బోయపాటి కాంబినేషన్లో రూపొందిన 'అఖండ' సినిమా, భారీ అంచనాల మధ్య విడుదలైంది. ఈ సినిమా అభిమానుల అంచనాలను అందుకుంటుందా? అని అంతా అనుకున్నారు. కానీ ఈ సినిమా అందరి అంచనాలను అధిగమించి ఆశ్చర్యపరిచింది.
విడుదలైన ప్రతి ప్రాంతంలో రికార్డు స్థాయి వసూళ్లను రాబడుతోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా గ్రాండ్ సక్సెస్ ఈవెంట్ ను నిన్నరాత్రి వైజాగ్ లో నిర్వహించారు. వేలాదిగా తరలివచ్చిన అభిమానుల సమక్షంలో బాలకృష్ణ మాట్లాడారు.
"ఈ సినిమా ఇంతటి విజయాన్ని సాధించడానికి కారకులైన ప్రేక్షకులకు .. అభిమానులకు అందరికీ కూడా నా హృదయపూర్వక కళాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. బోయపాటిగారు నా దగ్గరికి వచ్చి ఈ సినిమాకి 'అఖండ' టైటిల్ అనుకుంటున్నామనీ, బాగుందని అంటే ఎనౌన్స్ చేద్దామని అన్నారు.
వెంటనే నేను చాలాబాగుందనీ .. ఈ టైటిల్ తోనే ముందుకు వెళదామని అన్నాను. ఈ వేడుకను వైజాగ్ లో సాగరతీరాన .. సాయం సమయాన .. ముఖ్యంగా సుబ్రహ్మణ్య షష్ఠి రోజున జరుపుకోవడం ఆనందంగా ఉంది.
ఈ రోజు ఉదయం కూడా ఇక్కడ వర్షం పడింది .. రెండు రోజులపాటు వర్షాలు ఉంటాయని చెప్పారు. అయినా ఇప్పుడు ఇక్కడ వాతావరణం ఆహ్లాదంగా ఉంది. మనందరం ఇక్కడ ఇలా కలుసుకోవడానికి సహకరించిన ప్రకృతికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.
తాను గరళాన్ని మింగి లోకాలకు అమృతాన్ని పంచిన శివుడికి ముందుగా నమస్కరించుకుంటున్నాను. 'సింహా' .. ఆ తరువాత 'లెజెండ్' .. ఆ తరువాత 'అఖండ'. అంచనాలు ఒక రేంజ్ లో ఉంటాయి. అందువలన మాకు కూడా ఒళ్లు దగ్గర పెట్టుకుని పనిచేయాలనే భయం ఉంటుంది.
ఇంతకుముందు కూడా నేను చెప్పాను .. ఒక సినిమా అయ్యేంతవరకూ ఇంకో సినిమా గురించి ఆలోచన చేయను. 'లెజెండ్' చేస్తున్నప్పుడు 'సింహా' గురించి గానీ, 'అఖండ' చేస్తున్నప్పుడు 'లెజెండ్' గురించిగాని ఆలోచించలేదు.
ఎందుకంటే మాకు ఒకరిపట్ల ఒకరికి ఉన్న విశ్వాసం అలాంటింది. ఏ సినిమాకి కూడా ఆయన నాకు పూర్తి కథ చెప్పలేదు. ఇంతకుముందు సినిమాలకు కూడా అంతే. ఈ సినిమా కూడా 'కట్టే కొట్టే తెచ్చే' అంటూ మూడే ముక్కల్లో చెప్పేశారు. వెంటనే నేను ఓకే అనేశాను .. అలా ఈ సినిమా మొదలైపోయింది" అని చెప్పుకొచ్చారు.