Begin typing your search above and press return to search.

రాజకీయాలు ఉండవు మసాలా మాత్రమే

By:  Tupaki Desk   |   1 Feb 2019 5:27 AM GMT
రాజకీయాలు ఉండవు మసాలా మాత్రమే
X
సంక్రాంతి ముందు వరకు బాలకృష్ణ-బోయపాటి శీను కాంబినేషన్ మీదున్న సమీకరణలు ఇప్పుడు పూర్తిగా మారిపోయాయి. ఎవరికి వారు కెరీర్ బెస్ట్ డిజాస్టర్స్ రెండు రోజుల గ్యాప్ లో అందుకోవడం ఇరు అభిమానులకు ఇంకా డైజెస్ట్ కానే లేదు. ఒక పక్క ఎన్టీఆర్ కథానాయకుడు 50 కోట్ల నష్టంతో మరోపక్క బోయపాటి శీను చరణ్ తో చేసిన వినయ విధేయ రామ 35 కోట్ల లాస్ తో పాటు అదనంగా టన్నుల కొద్ది విమర్శలను మూటగట్టుకుంది. ఇవి బ్లాక్ బస్టర్ హిట్స్ అయ్యుంటే లెక్క వేరుగా ఉండేది కాని ఇప్పుడు మాత్రం ఇద్దరూ డిఫెన్స్ మోడ్ లో పడ్డ మాట నిజం.

ఎన్టీఆర్ ప్రీ రిలీజ్ లో ఫిబ్రవరిలో బాలయ్య షూటింగ్ ప్రారంభమవుతుందని ప్రకటించిన శీను ఇప్పుడు స్క్రిప్ట్ ని రెడీ చేసే పనిలో పడ్డాడు. అయితే గత రెండు రోజులుగా బాలకృష్ణ ఈ సినిమాలో ముఖ్యమంత్రిగా కనిపిస్తారనే ప్రచారం విపరీతంగా జరిగిపోయింది. ఇది బోయపాటి దృష్టికు కూడా వెళ్ళింది. దీని స్క్రిప్ట్ మీద బయట కనిపించకుండా వర్క్ చేస్తున్న శీను వీటిని పూర్తిగా కొట్టి పారేసినట్టు టాక్. అసలు ఏ జానర్ లో తీస్తున్నానో తాను చెప్పకుండా బయటికి పొలిటికల్ థీమ్ అనే ప్రచారం ఎలా వెళ్తోందని ఆశ్చర్యపోయాడట.

అలాంటిది ఏమి లేదని బాలయ్య ఇమేజ్ కే తగ్గట్టు సింహా లెజెండ్ అంచనాలను నిలబెట్టుకునేలా అవుట్ అండ్ అవుట్ మసాలా ఎంటర్ టైనర్ నే రూపొందించబోతున్నట్టు సమాచారం. అయితే ఎప్పుడు స్టార్ట్ అవుతుంది లాంటి వివరాలు చెప్పడం లేదు. పోనీ హీరోనే అడుగుదాం అంటే ఎన్టీఆర్ కథానాయకుడు ఫలితం తెలిసినప్పటి నుంచి బాలయ్య మీడియాకు చిక్కలేదు. మహానాయకుడికి అవసరమైన రిపేర్లు జరుగుతున్నాయని వాటి కోసం క్రిష్ తో కలిసి ఫుల్ బిజీగా ఉన్నాడని టాక్ వస్తోంది. చూస్తుంటే ఇదే నెలలో బాలయ్య శీనుల మూవీ స్టార్ట్ కావడం అనుమానంగానే ఉంది. వీటికి క్లారిటీ రావడానికి ఇంకొంత టైం పట్టేలా ఉంది