Begin typing your search above and press return to search.
వేట షురూ చేసిన రామ్-బోయపాటి!
By: Tupaki Desk | 5 Oct 2022 10:11 AM GMTఎనర్జిటిక్ స్టార్ ఉస్తాద్ రామ్-మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో పాన్ ఇండియాలో ఓ చిత్రం తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే సినిమా లాంఛనంగా ప్రారంభమైంది. తాజాగా దసరా సందర్భంగా గురువారం నుంచి షూటింగ్ కూడా మొదలు పెడెతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. # బోయపాటి ర్యాపో షూటింగ్ స్టార్ట్ ఫ్రమ్ టుమారో అంటూ పోస్టర్ రిలీజ్ చేసారు.
దీంతో రెగ్యులర్ షూటింగ్ రేపటి నుంచి మొదలు కాబోతుంది. రామోజీ ఫిలిం సిటీలో తొలి షెడ్యూల్ ని ప్లాన్ చేసారు. దీనిలో భాగంగా బోయపాటి మార్క్ యాక్షన్ సన్నివేశాలతో టీమ్ వేటకి సిద్దమవుతోంది. ఇందులో హీరోయిన్ గా శ్రీలీలని ఎంపిక చేసారు. ఈ బ్యూటీ అధికారిక ఎంట్రీ సినిమాకి ఓ రకమైన వైబ్ ని తీసుకొస్తుంది.
రామ్ ఎనర్జీకి శ్రీలీల అందంతో తోడైతే రచ్చ రంబోలా అన్న చందంగా కాంబో వైరల్ అవుతోంది. ఇద్దరు మంచి డాన్సర్స్... ఆ ఎనర్జీని మ్యాచ్ చేస్తూ థమన్ అందించే బాణీలు మరింత ఊపు తీసుకురావడం ఖాయం.
సంగీత దర్శకుడిగా థమన్ ఎంట్రీ సినిమాని అదనపు అస్సెట్ గా చెప్పొచ్చు. `అఖండ`తో బోయపాటి-థమన్ ఎలాంటి మ్యాజిక్ చేసారో చెప్పాల్సిన పనిలేదు.
అదే తరహా వైబ్ ని క్రియేట్ చేసేందుకు మరోసారి బోయపాటి..థమన్ నే రంగంలోకి దించారు. పాన్ ఇండియా ప్రాజెక్ట్ కాబట్టి మరింత శ్రద్దగా పనిచేసే అవకాశం ఉంది. ట్యాలెంటెడ్ సినిమాటోగ్రాఫర్ సంతోష్ డిటాకే చాయాగ్రాహకుడిగా.. తమ్మిరాజు ఎడిటింగ్ బాధ్యతలు తీసుకున్నారు. యాక్షన్ సీక్వెన్స్ ని శివ కొరియోగ్రఫీ చేస్తున్నారు.
ఇలా ప్రతిభావంతులపై సాంకేతిక నిపుణుల్ని రంగంలోకి దించారు. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. తెలుగు.. తమిళం.. కన్నడ.. మలయాళం.. హిందీ భాషల్లో భారీ ఎత్తున విడుదల కానుంది. రామ్-బోయపాటిలకు ఇది తొలి పాన్ ఇండియా సినిమా కావడంతో రిలీజ్ ని గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.