Begin typing your search above and press return to search.
బోయపాటికి రెమ్యునరేషనా లేక షేరా?
By: Tupaki Desk | 11 Dec 2021 2:30 AM GMTఫ్యామిలీ ఎంటర్‌టైనర్ కథలకి తనదైన మార్కు యాక్షన్ అంశాలతో పాటు భావోద్వేగాల్ని జోడించి తెరపై ఆవిష్కరించడంలో బోయపాటి శ్రీనుది ప్రత్యేక శైలి. అందుకే ఆయన సినిమాలంటే ఓ వర్గానికి చాలా మంది హీరోలకు ప్రత్యేక అభిమానం. హీరో పాత్ర ఎలివేషన్... ఆ పాత్రని వెండితెరపై తీర్చిదిద్దే తీరు ప్రతీ హీరోని ఆకట్టుకుంటుంది. అందుకే బోయపాటి డైరెక్షన్ లో ఒక్క సినిమా అయినా చేయాలని అనుకుంటారు. మెగాస్టార్ చిరంజీవి కూడా `అఖండ` చూసి తనతో సినిమాకు కథ రెడీ చేయమన్నారంటే బోయపాటి ప్రత్యేకత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
ఈయన తెరకెక్కించిన తాజా చిత్రం `అఖండ`. నందమూరి బాలకృష్ణ - బోయపాటి ల కలయికలో వచ్చిన హ్యాట్రిక్ హిట్ ఫిల్మ్ ఇది. డిసెంబర్ 2న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచనాలు సృష్టిస్తూ కాసుల వర్షం కురిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన బోయపాటి శ్రీను రెమ్యునరేషన్ ఎంతన్నది ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ బోయపాటి రెమ్యునరేషన్ ఎంత? .. అంటే ఆయన రెమ్యునరేషన్ తీసుకుంటేగా అంటున్నారు ఇండస్ట్రీ వర్గాలు.
`అఖండ` ముందు అనుకున్న బడ్జెట్ 80 కోట్లు. అయితే `వినయ విధేయ రామ` ఫ్లాప్ కావడంతో అంత పెట్టి సాహసం చేయలేమని నిర్మాత బడ్జెట్‌ని తగ్గించమని పట్టుబట్టారట. దీంతో 80ని కాస్త 70కి కుదించారట బోయపాటి. అయితే అందులో తన రెమ్యునరేషన్ ని తీసేశారట. రిలీజ్ తరువాత వచ్చే దాన్ని బట్టే తాను పారితోషికం తీసుకుంటానని చెప్పారట.
ఇప్పుడు సినిమా భారీగా వసూళ్లని రాబడుతున్న నేపథ్యంలో బోయపాటికి పారితోషికం ఇస్తారా? లేక షేర్ ఇస్తారా? అన్నది ఆసక్తికరంగా మారింది. తాజా పరిణామాల పరంగా బోయపాటికి 10 కోట్ల దాకా అందే అవకాశం వుందన్నది తాజాగా వినిపిస్తున్న వార్త. ఇది ఎంత వరకు నిజమన్నది తెలియాలంటే మరో వారం వరకు వేచి చూడాల్సిందే అంటున్నారు.