Begin typing your search above and press return to search.

ఆ సీన్ కోసం 32 సార్లు ఏడ్చిన 'వ‌సుమ‌తి'!

By:  Tupaki Desk   |   17 Aug 2018 4:47 PM GMT
ఆ సీన్ కోసం 32 సార్లు ఏడ్చిన వ‌సుమ‌తి!
X
టాలీవుడ్ - కోలీవుడ్ - బాలీవుడ్ లో కొంత‌మంది ద‌ర్శ‌కుల‌కు మిస్ట‌ర్ ప‌ర్ ఫెక్ట్ లుగా పేరుంది. తాను అనుకున్న సీన్ అనుకున్న విధంగా రాక‌పోతే....ఎన్ని టేక్ లు తీసేందుకైనా కోలీవుడ్ ద‌ర్శ‌కుడు శంక‌ర్ వెనుకాడ‌రు. ఇక బాలీవుడ్ లో రాజ్ కుమార్ హిరాణీ కూడా ఇదే కోవ‌కు చెందుతారు. టాలీవుడ్ ద‌ర్శ‌కుడు తేజ కూడా....పర్ ఫెక్ష‌న్ విష‌యంలో కాంప్ర‌మైజ్ కాడు. అయితే, తాజాగా మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి కూడా త‌న అప్ క‌మింగ్ మూవీలోని ఓ సీన్ విష‌యంలో కాంప్ర‌మైజ్ కాలేద‌ట‌. రామ్ చ‌ర‌ణ్ తో బోయ‌పాటి తీస్తున్న సినిమాలో...కైరా అద్వానీ న‌టించిన ఓ ఎమోష‌న్ సీన్ విష‌యంలో ఆయ‌న నో కాంప్ర‌మైజ్ అన్నాడ‌ట‌. చివ‌ర‌కు 32 టేకులు తీసుకున్న త‌ర్వాత కైరాకు బోయ‌పాటి ఓకే చెప్పాడ‌ట‌. త‌న‌ను బోయ‌పాటి 32 సార్లు ఏడిపించిన విష‌యాన్ని కైరా తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో షేర్ చేసుకుంది.

`భ‌ర‌త్ అనే నేను`లో కైరా అద్వానీ ...న‌ట‌న‌కు స్కోప్ ఉన్న పాత్ర చేయ‌క‌పోయినా...త‌న అందం - అభిన‌యంతో ఆక‌ట్టుకుంది. దీంతో - చెర్రీ - బోయ‌పాటి ల కాంబోలో తెర‌కెక్కుతోన్న మూవీలో చాన్స్ కొట్టేసింది. ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య రూపొందిస్తోన్న ఈ చిత్ర షూటింగ్‌లో కైరా బిజీగా గ‌డుపుతోంది. ఈ చిత్రంలో కైరా....ప‌ర్ ఫార్మ‌న్స్ కు స్కోప్ ఉన్న పాత్ర పోషిస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఈ క్ర‌మంలోనే కైరా...ఆ మూవీకి సంబంధించిన ఆస‌క్తిక‌ర అప్ డేట్ ఇచ్చింది. ఓ ఎమోష‌న‌ల్ సీన్ కోసం తాను 32 టేక్స్ తీసుకున్నాన‌ని కైరా చెప్పింది. ఆ సీన్ సినిమాలో చాలా కీల‌క‌మైంద‌ని - అందుకే ప‌ర్ ఫెక్ట్ గా రావాల‌ని బోయ‌పాటి అనుకున్నార‌ని చెప్పింది. అందుకే....త‌న‌ను 32 సార్లు ఏడిపించి మ‌రీ ఆ సీన్ ఓకే చేశార‌ని తెలిపింది. మ‌రి, 32 సార్లు ఏడిపించిన ఆ సీన్....కైరాకు మ‌రిన్ని సినిమాలు తెచ్చిపెడుతుందేమో వేచి చూడాలి.