Begin typing your search above and press return to search.

ఆంధ్రా- తెలంగాణ సంస్కృతిని టచ్ చేస్తున్నారా?

By:  Tupaki Desk   |   2 Dec 2022 5:13 AM GMT
ఆంధ్రా- తెలంగాణ సంస్కృతిని టచ్ చేస్తున్నారా?
X
స్టార్ మేక‌ర్ బోయ‌పాటి ఆంధ్రా-తెలంగాణ సంస్కృతి సంప్ర‌దాయాల్ని కెలుకుతున్నారా? రామ్ తో పాన్ ఇండియా కోసం రెండు రాష్ర్టాల‌ సంప్ర‌దాయాల్ని బేస్ చేసుకున్నారా? 'అఖండ‌'తో పాన్ ఇండియాలో వ‌చ్చిన గుర్తింపును స‌రిగ్గా ఈ సినిమాతో ఎగ్జిక్యూట్ చేసే ప్లాన్లో ఉన్నారా? అంటే అవున‌నే లీకులందుతున్నాయి.

రామ్-బోయ‌పాటి కాంబినేష‌న్ లో ఓ భారీ పాన్ ఇండియా చిత్రం తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. రామ్ ఎన‌ర్జీని మ్యాచ్ చేస్తూ బోయ‌పాటి శైలి యాక్ష‌న్ కంటెంట్ సినిమాలో హైలైట్ కానుంది. తెర‌పై కొత్త రామ్ ని చూస్తార‌ని...బోయ‌పాటి రొటీన్ సినిమాల‌కు సైతం భిన్న‌మైన యాక్ష‌న్ కంటెంట్ సినిమాలో హైలైట్ అవుతుంద‌ని పెద్ద ఎత్తున ప్ర‌చారం సాగుతోంది.

ఈ నేప‌థ్యంలో బోయ‌పాటి ఎలాంటి మూల క‌థ తీసుకున్నా ఓ సెక్ష‌న్ ఆడియ‌న్స్ లో చ‌ర్చ‌కొస్తుంది. తాజాగా నయా మేక‌ర్ సంచ‌ల‌న అంశాన్నే ట‌చ్ చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఆంధ్రా-తెలంగాణ సంస్కృతి సంప్ర‌దాయాల్ని బేస్ చేసుకుని రాసుకున్న క‌థ‌లా ప్ర‌చారం సాగుతోంది. అందుకోసం బోయ‌పాటి చ‌రిత్ర‌ని లోతుగానే విశ్లేషించిన‌ట్లు వినిపిస్తుంది. అస‌లు ప్ర‌త్యేక తెలంగాణ నినాదం ఎందుకు వ‌చ్చింది? అన్న అంశాన్ని హైలైట్ చేస్తూ క‌థ‌ని ఇప్ప‌టి జ‌న‌రేష‌న్ కి మ‌లిచి పూర్తి స్థాయిలో క‌మ‌ర్శిలైజ్డ్ చేసిన‌ట్లు స‌మాచారం.

రెండు రాష్ర్టాల మ‌ధ్య ఉన్న స‌నాత‌న‌ సంప్ర‌దాయాల్ని..కళాత్మ‌క‌త‌క‌ని హైలైట్ చేస్తూ పాన్ ఇండియా కి క‌నెక్ట్ అయ్యేలా? ఓ యూనిక్ పాయింట్ని ఇన్బిల్ట్ చేస్తున్న‌ట్లు స‌మాచారం. దీంతో దీనికి 'అఖండ' సైతం కొంత వ‌ర‌కూ స్ఫూర్తిగా నిలుస్తున్న‌ట్లు ఓ సందేహం తెర‌పైకి వ‌స్తుంది. 'అఖండ‌' ఓటీటీ రిలీజ్ త‌ర్వాత నార్త్ లో అనూహ్యంగా క‌నెక్ట్ అయింది. ఇది ఏ మాత్రం గెస్ చేయ‌నిది.

ఇందుకు ఓ ప్ర‌త్యేక కార‌ణం ఉంది. క‌థలో కొన్ని అంశాలు నార్త్ ఆడియ‌న్స్ కి విప‌రీతంగా క‌నెక్ట్ అయ్యాయి. పాన్ ఇండియాలో అఖండ‌ని థియేట్రిక‌ల్ రిలీజ్ చేస్తే ఇంకా పెద్ద విజ‌యం సాధించేది అన్న ఫీడ్ బ్యాక్ వ‌చ్చింది. తాజాగా రామ్ న‌టిస్తోన్న‌ స్ర్కిప్ట్ విష‌యంలోనూ అలాంటి యాదృశ్చిక‌మే చోటు చేసుకున్న‌ట్లు తెలుస్తోంది.

'అఖండ‌'కి ముందే రామ్ క‌థ‌ని బోయ‌పాటి సిద్దం చేసి పెట్టుకున్నారు. 'అఖండ' లో కొన్ని పాయింట్లు రామ్ సినిమాకి క‌నెక్టింగ్ గా ఉన్నాయట‌. ఇలా కోయిన్ సైడ్ అవ్వ‌డం అన్న‌ది అనుకోకుండా జ‌రిగింది. దీంతో రామ్ సినిమా పాన్ ఇండియాలో అతి పెద్ద విజ‌యం సాధిస్తుంద‌ని టీమ్ ధీమా వ్య‌క్తం చేస్తుందిట‌. మ‌రి అస‌లి సంగ‌తేంటి? అన్న‌ది తెలియాలి. ఇంత‌వ‌ర‌కూ బోయ‌పాటి ఎక్క‌డా సినిమా ప్లాట్ గురించి రివీల్ చేసింది లేదు.

మీడియాలో వ‌స్తోన్న‌క‌థ‌నాలు మిన‌హా టీమ్ స‌భ్యులెవ‌రు? అధికారికంగా వెల్ల‌డించ‌లేదు. ఈ సినిమా కొత్త షెడ్యూల్ గురువారం హైరాబాద్ లో ప్రారంభమైంది. రామ్ పై భారీ యాక్ష‌న్ స‌న్నివేశాలు చిత్రీక‌రిస్తున్నారు. ఆయ‌న పాత్ర ప‌రిచ‌య స‌న్నివేశాల్లో భాగంగా వ‌చ్చే పోర‌ట ఘ‌ట్టంగా తెలుస్తోంది. వీటికి స్టంట్ శివ నేతృత్వం హిస్తున్నారు. ఆయ‌న‌తో పాటు బోయ‌పాటి కూడా ప‌ర్య‌వేక్షిస్తున్నారు. దాదాపు నెల రోజుల‌పాటు ఈ షెడ్యూల్ సాగ‌నుంద‌ని స‌మాచారం.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.