Begin typing your search above and press return to search.

విశాల్ తో బోయ‌పాటి భారీ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్

By:  Tupaki Desk   |   19 July 2021 2:34 PM GMT
విశాల్ తో బోయ‌పాటి భారీ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్
X
సౌత్ లో భారీ మాస్ ఇమేజ్ ఉన్న‌ హీరో -మాస్ డైరెక్ట‌ర్ కాంబినేష‌న్ లో సినిమా వ‌స్తే ఎలా ఉంటుందో చెప్పాల్సిన ప‌నిలేదు. హై ఓల్టేజ్ యాక్ష‌న్. న‌రాలు తెగే ఉత్కంఠ‌తో థ్రిల్లింగ్ స‌న్నివేశాలతో రెట్టించిన అంచ‌నాలు ఏర్ప‌డుతాయి. మ‌రి టాలీవుడ్ లో అలాంటి కాంబినేష‌న్ ఏదైనా ఉందా అంటే.... ఉంది అంటున్నారు మాస్ ద‌ర్శ‌కుడు ఓయ‌పాటి.. విశాల్ హీరోగా అత‌డు ఓ భారీ యాక్ష‌న్ చిత్రానికి సన్నాహాలు చేస్తుండ‌డం ఆస‌క్తిని రేకెత్తిస్తోంది.

విశాల్ కు టాలీవుడ్ కోలీవుడ్ లో ఉన్న మాస్ ఇమేజ్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. ఆయ‌న కెరీర్ ఆరంభంలో ఎన్నో మాస్ యాక్ష‌న్ చిత్రాల్లో న‌టించి అటుపై రెగ్యుల‌ర్ క‌మ‌ర్షియ‌ల్ చిత్రాల‌కు దూరంగా సినిమాలు చేస్తూ వ‌చ్చారు. అభిమ‌న్యుడు లాంటి ప్ర‌యోగాత్మ‌క చిత్రాల‌తోనూ ఆక‌ట్టుకున్నాడు. ఇక బోయ‌పాటి శ్రీను ఊర మాస్ కంటెంట్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. ఆయ‌న ప్ర‌తీ సినిమా కూడా హై ఓల్టేజ్ యాక్ష‌న్ తో ఎగ్జ‌యిట్ చేస్తారు. మ‌రి అలాంటి కాంబినేష‌న్ చేతులు క‌లిపితే ఇంకెలా ఉంటుందో చెప్పాల్సినవ‌సరం లేదు. స‌రిగ్గా టాలీవుడ్ ఆడియ‌న్స్ ప‌ల్స్ కి చేరువ‌గా ఉండే ఈ జోడీ ఇప్పుడు భారీ మాస్ ఎంట‌ర్ టైన‌ర్ కు రంగం సిద్దం అవుతున్న‌ట్లు ఫిలిం స‌ర్కిల్స్ లో జోరుగా ప్ర‌చారం సాగుతోంది.

విశాల్ క‌టౌట్..మాస్ ఇమేజ్ కు త‌గ్గ ఓ భారీ యాక్ష‌న్ స్క్రిప్ట్ ని సిద్దం చేయించిన‌ట్లు స‌మాచారం. ర‌చ‌యిత ఎం ర‌త్నం ఈ సినిమాకు క‌థ‌- మాట‌లు అందిస్తున్నారుట‌. ఈ చిత్రాన్ని నిర్మించడానికి దిల్ రాజు ముందుకొచ్చిన‌ట్లు తెలిసింది. రాజు గారు కూడా ఎంతో మెచ్చి న‌మ్మి చేస్తోన్న చిత్ర‌మిద‌ని బ‌లంగా వినిపిస్తోంది. స్క్రిప్ట్ ల విష‌యంలో రాజుగారి జ‌డ్జిమెంట్ కు తిరుగుండ‌దు. అన్ని యాంగిల్స్ లోనూ స్క్రిప్ట్ ని స్డడీ చేసిన త‌ర్వాతే రాజుగారు రంగంలోకి దిగుతారు కాబ‌ట్టి విశాల్-బోయ‌పాటి కాంబినేష‌న్ పై భారీ అంచ‌నాలు ఏర్ప‌డ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది.

ఇక ఈ చిత్రాన్ని వ‌చ్చే ఏడాది సెట్స్ పైకి తీసుకెళ్లాల‌ని ప్లాన్ చేస్తున్నారుట‌. ప్ర‌స్తుతం బోయ‌పాటి న‌ట‌సింహ బాల‌య్య తో `అఖండ` తెర‌కెక్కిస్తోన్న సంగ‌తి తెలిసిందే. అలాగే విశాల్ కూడా కోలీవుడ్ చిత్రాల‌తో బిజీగా ఉన్నారు. బోయ‌పాటి- విశాల్ సినిమా నిజ‌మైతే విశాల్ కు తొలి తెలుగు సినిమా ఇదే అవుతుంది.