Begin typing your search above and press return to search.

ఈ ఇద్దరూ అనవసరంగా లేటయ్యారు

By:  Tupaki Desk   |   30 Dec 2015 3:37 AM GMT
ఈ ఇద్దరూ అనవసరంగా లేటయ్యారు
X
నిజానికి ఒక హిట్టు సినిమా పడిన వెంటనే రెండోది టపీమని పడిపోవాలి. అలా పడకపోతే ఆ దర్శకుడిని చాలా ఫాస్ట్‌ గా మర్చిపోతారు మన ఆడియన్స్‌. పైగా ఈ మధ్యన కొత్త హీరోయిన్లకంటే ఎక్కువగా కొత్త దర్శకులే వస్తున్నారు. అందుకే హిట్టు కొట్టిన స్టార్‌ డైరక్టర్లు స్పీడుగా పనిచేయకపోతే కష్టం.

మ్యాటర్‌ లోకి వెళితే.. లెజెండ్‌ వంటి బ్లక్‌ బస్టర్‌ కొట్టిన బోయపాటి శ్రీను.. బీభత్సమైన పంచ్‌ తినేశాడు. వెంటనే ఏ పెద్ద హీరోతోనూ సినిమా బిగిన్‌ కాలేదు. బెల్లంకొండ శ్రీనివాస్‌ హీరోగా ఒక సినిమా మొదలయ్యి ఆగిపోయింది. కట్‌ చేస్తే.. చివరకు బన్నీ తో సరైనోడు సినిమాను తీస్తున్నాడు. ఆ విధంగా మనోడు 2015లో కనీసం ఒక్క రిలీజ్‌ కూడా చేయలేకపోయాడు.

ఇదే కోవకు చెందిన మరో దర్శకుడు వంశీ పైడిపల్లి. ఎవడు సినిమాతో మాంచి హిట్టు కొట్టాడని అనుకుంటే.. ఆ తరువాత మల్టీ స్టారర్‌ సినిమా అంటూ ఎన్టీఆర్‌ చుట్టూ తిరిగి టైమ్‌ వేస్టు చేసుకొని చివరకు నాగార్జున-కార్తి జంటగా ఊపరి తీసుకున్నాడు. కాని 2015 దసరా నుండి ఆ సినిమా తెలియని డేట్‌ కు వాయిదా పడింది. ఇంకా షూటింగ్‌ జరుగుతూనే ఉంది.

అలా ఏ యాంగిల్‌ లో చూసిన ఈ ఇద్దరు దర్శకులూ లేటయ్యారంతే!!