Begin typing your search above and press return to search.

బెల్లంకొండ రాజా.. ఎక్కడి నుంచి తెచ్చారో

By:  Tupaki Desk   |   2 July 2017 8:33 AM GMT
బెల్లంకొండ రాజా.. ఎక్కడి నుంచి తెచ్చారో
X
బోయపాటి శ్రీను సినిమా అంటే జనాల్లో మైండ్ లో.. ఆ మూవీ గురించి ఓ ఫిక్సేషన్ వచ్చేస్తుంది. భారీ ఫైట్స్.. గొంతు చించుకునే విలన్స్.. సుదీర్ఘంగా సాగే యాక్షన్ ఎపిసోడ్స్.. ఇలా ఉంటాయి జనాల ఆలోచనలు. బెల్లంకొండ శ్రీనివాస్ తో బోయపాటి శ్రీను సినిమా అనగానే ఇలాగే ఊహించుకున్నారంతా.

కానీ 'జయ జానకి నాయక' అంటూ టైటిల్ తోనే ఆశ్చర్యపరిచిన బోయపాటి.. ఫస్ట్ లుక్ తో మరీ షాక్ ఇచ్చేశాడు. ఇప్పుడీ సినిమా గురించి కొత్త విషయాలు కూడా చెప్పాడు బోయపాటి. 'ఓ రాజ కుటుంబం నుంచి వచ్చే ఇంజినీరింగ్ స్టూడెంట్ పాత్రలో బెల్లంకొండ శ్రీనివాస్ కనిపిస్తాడు. రకుల్ ప్రీత్ సింగ్ తో ప్రేమలో పడ్డ తర్వాత.. తన ప్రేమను ఎలా గెలిపించుకున్నాడన్నదే స్టోరీ. హీరో ఫాదర్ పాత్రలో శరత్ కుమార్ నటిస్తుండగా.. సోదరిగా నందు కనిపిస్తాడు' అని చెప్పిన బోయపాటి.. ఈ సినిమాలో బోలెడన్ని ఫ్యామిలీ ఎమోషన్స్ మిక్స్ ఉంటాయన్నాడు.

స్టోరీ సంగతి బాగానే ఉంది కానీ.. రాయల్ ఫ్యామిలీ నుండి వచ్చే యువరాజు.. మిడిల్ క్లాస్ బ్యూటికి పడిపోవడం అనే కాన్సెప్ట్ ఎప్పటి నుంచో ఉన్నదే. మహేష్ చేసిన శ్రీమంతుడు మూవీలో కూడా లవ్ ట్రాక్ థీమ్ ఇదే. ఇక సోనమ్ కపూర్ మూవీ ఖూబ్ సూరత్ సినిమా అయితే అచ్చం ఇలాగే ఉంటుంది. ఇప్పుడు జయ జానకి నాయక మూవీని.. ఖూబ్ సూరత్ ను స్ఫూర్తిగా తీసుకున్నారనే టాక్ వినిపిస్తోంది. ఈ మూవీలో రకుల్ ప్రీత్ సింగ్ తన కెరీర్ లో బెస్ట్ ట్యాలెంట్ చూపించేసిందని.. మూవీలో ఆమె పాత్ర జనాలకు షాక్ ఇచ్చేస్తుందని దర్శకుడు చెప్పడం చూస్తే.. నిజమేనేమో అనిపించక మానదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/