Begin typing your search above and press return to search.

నాన్నగారు పది రెట్లు పవర్ ఫుల్ గా చెప్పారట!

By:  Tupaki Desk   |   10 Jan 2019 2:27 PM GMT
నాన్నగారు పది రెట్లు పవర్ ఫుల్ గా చెప్పారట!
X
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కొత్త సినిమా 'వినయ విధేయ రామ' రేపే(శుక్రవారం) ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమా ప్రోమోస్ అన్నీ ఎలా ఉంటుంది ఇండికేషన్స్ ఇచ్చాయి. చరణ్ పూర్తిగా బోయపాటి హీరోగా మారి ఊరమాస్ అవతారమెత్తాడని ఆడియన్స్ అర్థం చేసుకున్నారు. ఇక ఈ సినిమా టీజర్ లోని 'రామ్ కొ..ణి..దె..ల' డైలాగ్ ఎంత పాపులర్ అయిందో అందరికీ తెలిసిందే. సరిగ్గా ఈ డైలాగ్ గురించి చరణ్ ఒక ఇంట్రెస్టింగ్ విషయాన్ని పంచుకున్నాడు.

ఈ సినిమాలో చాలా సీన్లలో తన పేరును చెప్తాడట చరణ్. కొన్ని డైలాగులకు ముందు కొన్ని డైలాగులకు వెనక రామ్ కొణిదెల పేరును చెప్పానని.. ఆ డైలాగులు చెప్పే సమయంలో తనకేమీ ఇబ్బందిగా అనిపించలేదన్నాడు. కాకపొతే నాన్నగారు మాత్రం బోయపాటిని ఈ విషయంలో ప్రశ్నించారని చెప్పాడు. "బోయపాటి.. అసలు ఎవరి పర్మిషన్ తీసుకుని ఆ పేరు వాడావు?" అంటూ సరదాగా అడిగారట.

ఏదేమైనా మెగాస్టార్ కూడా ఈ డైలాగ్ పట్ల ముచ్చట పడ్డాడు. లేకపోతే 'కొ..ణి..దె..ల' డైలాగ్ ను ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చరణ్ స్టైల్ లో చెప్పి ఉండేవారు కాదు కదా? చిరు ఆ డైలాగ్ చెప్పడంతో ఫ్యాన్స్ థ్రిల్ అయ్యారు. చిరంజీవి తన డైలాగ్ చెప్పడం గురించి చరణ్ మాట్లాడుతూ "ప్రీ రిలీజ్ ఈవెంట్లో నాన్నగారు నాకంటే పదిరెట్లు పవర్ఫుల్ గా ఆ డైలాగ్ చెప్పారు" అంటూ మురిసిపోయాడు.